సూర్యాపేట డీఎంహెచ్‌వో కుటుంబంలో ఆరుగురికి కరోనా సోకింది. ‌ఐదు రోజుల క్రితం డీఎంహెచ్‌వో కుమారుడు జర్మనీ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం డీఎంహెచ్‌వో కుటుంబం తిరుపతి వెళ్లి వచ్చింది. తిరుపతి వెళ్లి వచ్చిన డీఎంహెచ్‌వో కుటుంబ సభ్యుల్లో కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో బుధవారం కోవిడ్‌ పరీక్షలు చేసుకున్నారు. డీఎంహెచ్వో భార్య, కుమారుడు, కోడలకు పాజిటివ్ నిర్ధరణ అయింది. ఇవాళ కోవిడ్‌ పరీక్ష చేయించుకున్న డీఎంహెచ్‌వోకు కూడా కోవిడ్‌ నిర్ధరణ అవ్వడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. బుధవారం ఎయిడ్స్ డేలో పాల్గొన్న డీఎంహెచ్‌వో... పలువురు సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించారు. దీంతో తిరుపతి, సూర్యాపేటలలో కలకలం రేగింది. ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. డైరెక్ట్ కాంటాక్స్ వెదికే పనిలో పడ్డారు. 


Also Read: ఒమిక్రాన్‌'పై గుడ్‌ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!


గురుకుల పాఠశాలలో 24 మంది బాలికలకు కరోనా


సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెర్వు మండలం ఇంద్రేశంలోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 24 మంది బాలికలకు కోవిడ్ సోకింది. వారం రోజుల క్రితం ఆరో తరగతి విద్యార్థినికి జ్వరం రావడంతో బాలికను ఇంటికి పంపించారు. ఆ విద్యార్థినికి కోవిడ్‌ నిర్థారణ అవ్వడంతో బాలిక తండ్రి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌కు ఫోన్‌లో సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది, వైద్యులు గురువారం పాఠశాలలోని 300 మంది బాలికలకు కోవిడ్‌ పరీక్షలు చేశారు. వీరిలో 24 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. దీంతో విద్యా్ర్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు చెందుతున్నారు. అధికారులు పాఠశాల మొత్తాన్ని శానిటైజ్‌ చేయించారు. 


Also Read: దేశంలోకి 'ఒమిక్రాన్' ఎంట్రీ.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక


తెలంగాణ ప్రభుత్వం అలెర్ట్


కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉందని తెలంగాణ డైరక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు హెచ్చరించారు. బ్రిటన్ నుంచి వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. ఆమెకు ఒమిక్రాన్ వైరస్ సోకిందన్న అనుమానతో జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లుగా చెప్పారు. ఫలితాలు వచ్చాక ఒమిక్రానా కాదా అనేది తెలుస్తుంది. ఒమిక్రాన్‌ నివారణకు ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు.  ప్రజలు కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. ఒమిక్రాన్‌ ఎప్పుడైనా దేశంలోకి రావొచ్చని శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. డెల్టా కంటే ఒమిక్రాన్‌ ఆరు రెట్లు వేగంగా విస్తరిస్తోంది. మూడ్రోజుల్లోనే 3 దేశాల నుంచి 24 దేశాలకు వ్యాప్తి చెందిందని శ్రీనివాసరావు గుర్తు చేశారు. ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్‌ తీసుకోనివారు.. రెండో డోస్‌ టీకా తీసుకోవాల్సిన వారు కచ్చితంగా వ్యాక్సినేషన్‌కు వెళ్లాలని  విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 25 లక్షల మంది రెండో డోస్ తీసుకోవాల్సి ఉందని.. వీరంతా వెంటనే వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ వేసుకోకపోతే ఆత్మహత్య చేసుకున్నట్టే నంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌత్ ఆఫ్రికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగకపోవడంతోనే కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారని గుర్తుచేశారు. 


Also Read:  ఒమిక్రాన్ ఎప్పుడైనా రావొచ్చు... తెలంగాణలో హైఅలర్ట్ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి