Telangana Congress List :  తెలంగాణ కాంగ్రెస్ టిక్కెట్ల కసరత్తు హైదరాబాద్ లో పూర్తయింది. షార్ట్ లిస్ట్ నేతల జాబితాను ఢిల్లకి పంపించారు. కేంద్ర ఎన్నికల కమిటీ తుది జాబితాను ఖరారు చేస్తుంది.  కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం కోసం వచ్చిన వెయ్యి దరఖాస్తులను  మూడు రోజుల పాటు  తెలంగాణ రాష్ట్ర స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలించింది. అభిప్రాయ సేకరణ జరిపింది.  ఇందుకోసం రెండు రోజులు గాంధీభవన్‌లో .. ఓ రోజు  హోటల్‌లో స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌ అధ్యక్షతన సమావేశం అయింది.  రాష్ట్ర స్థాయిలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తయింది.  తుది నివేదిక రూపొందించి సీల్డ్‌ కవర్లో కాంగ్రెస్‌ ఎలక్షన్‌ కమిటీకి, స్క్రీనింగ్‌ కమిటీ పంపించారు.                             


దాదాపుగా  30 నియోజకవర్గాల్లో ఒకే అభ్యర్థిని రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీ సిఫారసు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. మిగిలిన నియోజకవర్గాల అభ్యర్థులపైనా చర్చించింది. త్వరలోనే అన్ని నియో జకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ పార్టీ వెలువరించనున్నట్టు సమాచారం. ప్రదేశ్‌ ఎలక్షన్‌ కమిటీ దరఖాస్తులపై ఇప్పటి వరకు తాము చర్చించిన అంశాలను స్క్రీనింగ్‌ కమిటీ ముందుంచింది. అయినా స్క్రీనింగ్‌ కమిటీ ప్రత్యేకంగా పీఈసీ సభ్యులతో మరోసారి అభిప్రాయాలు తీసుకుంది.కమిటీకి వచ్చిన అభిప్రాయాలపై సమగ్రంగా చర్చించింది. తుదకు ప్రతి నియోజకవర్గం నుంచి మూడు పేర్లను ఖరారు చేసేందుకు ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీకి అందించనుంది.                                          


సెప్టెంబర్‌ మూడోవారంలో కాంగ్రెస్‌ మొదటి జాబితా విడుదల చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్‌ రెండోవారంలో రెండో జాబితా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. ముందుగానే అభ్యర్థులు అందర్నీ ప్రకటించాల్సి ఉన్నా  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహాలను గుర్తించడం కకష్టం కాబట్టి.. అందర్నీ ప్రకటించకపోవడం మంచిదనే నిర్మయానికి వచ్చారు. అభ్యర్థుల్ని ప్రలోఫపెడితే.. పార్టీ పరిస్థితి వీక్ అయిపోతుందని లొంగిపోయేవారిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తే ఇక గెలిచిన తర్వాత వారు పార్టీలో ఎందుకు ఉంటారన్న చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి రానీయకుండా... మెజార్టీ నియోజకవర్గాల్లో లిస్టును .. ఎ్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతనే ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.                      


అయితే నియోజకవర్గాల్లో తిరుగులేని నేతలుగా ఉండి.. పార్టీ కోసం మొదటి నుంచి  పని చేస్తున్న వారికి మొదటి జాబితాలోనే చోటు కల్పించి గౌరవం ఇవ్వాలనుకుంటున్నారు. జమిలీ ఎన్నికల  గురించి దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది.  బీజేపీ వ్యూహం ఏమిటన్నది తేలిన తర్వాత .. అభ్యర్థుల జాబితా బయటకు రానుంది. పార్లమెంట్  ప్రత్యేక సమావేశాల తర్వాతే అసలు నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు.