తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. యాసంగి వరి సాగుపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేళంలో సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం మేరకే కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ విషయాన్ని చెప్పకుండా కేసీఆర్‌ కుటుంబం కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తుందన్నారు. కుటుంబ పార్టీలు దేశానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని బీజేపీ కార్యకర్తలను కోరారు కిషన్ రెడ్డి. హుజురాబాద్ ఎన్నికలప్పుడు ప్రగతిభవన్‌ పూర్తిగా టీఆర్ఎస్ కార్యాలయంగా  మారిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీని ఎంత అణచివేయాలని చూస్తే అంతగా తిరగబడతామని ప్రజలు నిరూపించారన్నారు. 







Also Read:డిసెంబర్ 17 నుంచి రెండో విడత పాదయాత్ర.. 2023లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్న బండి సంజయ్ !


దళిత బంధు ఎందుకు అమలు చేయడం లేదు


హుజురాబాద్‌ ఓటమి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి సీఎం కేసీఆర్ వరి ధాన్యం కొనుగోలు తెరపైకి తెచ్చారని కిషన్ రెడ్డి ఆరోపించారు. లేని సమస్యను ఉన్నట్లు సృష్టించి కేసీఆర్‌ ధర్నా చేశారని విమర్శించారు. పంటల బీమా పథకం రాష్ట్రంలో అమలు చేయడంలేదని దుయ్యబట్టారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని ఎందుకు తెరవడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో శనగలు పంపిణీ చేయలేదన్నారు. దళితబంధు ఆపాలని బీజేపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిందని తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఎన్నికలు ముగిసినా దళిత బంధు ఎందుకు అమలుచేయడంలేదని ప్రశ్నించారు. అసలైన కవులు, కళాకారులు టీఆర్ఎస్ పార్టీలో లేరని వారిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం విధిస్తుందన్నారు.


Also Read: వరిదీక్షలో తెలంగణ కాంగ్రెస్ నేతల ఐక్యతారాగం.. వరి కొనకపోతే కేసీఆర్ గద్దె దిగాల్సిందేనని హెచ్చరిక !


Also Read: సీఎం కేసీఆర్ ఓ హంతకుడు..! వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు, కవిత టార్గెట్‌గా ట్వీట్


Also Read: Poor States : పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !


Also Read: తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవు దినాలు ఇవే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి