ఐదు శాతం ఓట్లతో బీహార్‌లో ఎంఐఎం పార్టీ 12 సీట్లు గెలుచుకుంటే 80 శాతం హిందువులున్న తెలంగాణలో బీజేపీ ఎన్ని సీట్లు సాధించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో రెండో రోజు ఆయన ప్రసంగించారు. సెంబరు 17నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. బీసీలకు ఆత్మగౌరవ భవనాలేమయ్యాయని ..ఫీజు రీయంబర్స్ అందక ఫీజులు చెల్లించే స్తోమత లేక విద్యార్థులు అల్లాడిపోతున్నారన్నారు. మాట్లాడితే బీసీ కుల గణన అని డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. 


Also Read : సీఎం కేసీఆర్ ఓ హంతకుడు..! వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు, కవిత టార్గెట్‌గా ట్వీట్


సమగ్ర కుటుంబ సర్వే ఏమైందని బండి సంజయ్ ప్రశ్నించారు. గొర్లెన్ని..బర్లెన్ని అని కర్ఫ్యూ పెట్టి లెక్కలు తీశారని.. ఆ రిపోర్ట్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు సహా పేదలంతా ఎక్కడికి వెళ్లినా "మీరే మాకు అండ" అంటూ బీజేపీ కార్యకర్తలకు చెబుతున్నారన్నారు.  డబుల్ బెడ్రూం పేరుతో రైతులను, ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారన్నారు.  చిత బియ్యం, ఫ్రీ వ్యాక్సిన్ సహా గ్రామాల అభివృద్ధికి కేంద్రం పాటుపడుతోందన్నారు. 


 






Also Read: తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవు దినాలు ఇవే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్


సీఎం కారణంగా అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో విద్యావ్యవస్థ మొత్తం దెబ్బతింది. ఎంబీసీ పేరుతో బీసీ కులాల మధ్య కేసీఆర్‌ చిచ్చు పెట్టారని ఆరోపించారు. టీఆర్ఎస్ నియంత-అవినీతి కుటుంబ పాలనను ఎండగట్టేందుకు, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నామని బండి సంజయ్ గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. అధికారంలోకి వచ్చిన తరువాత...ఇక్కడున్న వాళ్లలో ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా కూడా అర్హులైన పేదలందరికీ ఉచితంగా విద్య, వైద్యం అందించే ఫైలుపై సంతకం పెట్టించే బాధ్యత తాను తీసుకుంటానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. 


Also Read: Shilpa Chowdary: మహిళా నిర్మాతపై చీటింగ్ కేస్... కంప్లయింట్ చేసిన ప్రముఖ టాలీవుడ్ యాక్టర్?


తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి. రక్తం ధార పోసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సంజయ్ పిలుపునిచ్చారు.  ప్రగతిభవన్‌లో నాలుగు స్తంభాలాట ప్రారంభమైంది. తమను సీఎంను చేయాలని కుమారుడు, బిడ్డ, అల్లుడు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించే గొంతుకలను పార్టీ నుంచి బయటకు పంపిస్తున్నారని విమర్శించారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో విజయం సాధించిన  ఈటల రాజేందర్‌ను కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ సన్మానించారు.


Also Read: Poor States : పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి