తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం కలిసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ జరుగుతోందని ఫిర్యాదు చేశారు. తక్షణమే బదిలీల ప్రక్రియను నిలిపేయడంతోపాటు 317 జీవోను సవరించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. ఈ బృందంలో ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. 


Also Read: హైదరాబాద్‌లో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ రెడీ .. న్యూ ఇయర్ రోజునే అందుబాటులోకి !


గవర్నర్ ను కలిసిన బీజేపీ ప్రతినిధుల బృందం రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా ఉద్యోగుల బదిలీల ప్రక్రియను తక్షణమే నిలిపేయడంతోపాటు 317 జీవోను సవరించాలని వినతి పత్రం అందించారు.  తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నినాదం నీళ్లు-నిధులు-నియమాకాలకు విరుద్ధంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. ఈ ఉత్తర్వులు 3 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయన్నారు. 317 జీవో అమలుతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇతర జిల్లాల్లోనే స్థానికేతరులుగా మారే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఈ జీవో అమలైతే మారుమూల ప్రాంతాల్లో మరో 2, 3 దశాబ్దాలపాటు ఉద్యోగ ఖాళీలు అయ్యే అవకాశమే ఉండదన్నారు. దీనివల్ల ఆయా ప్రాంతాల నిరుద్యోగులకు తీవ్రనష్టమని బీజేపీ ప్రతినిధులు గవర్నర్ కు తెలిపారు. 317 జీవోలో 28వ పేరా రాష్ట్రపతి ఉత్తర్వులను, రాజ్యాంగాన్ని ధిక్కరించేలా ఉందని ఫిర్యాదు చేశారు. 


Also Read: హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం, వంతెనకు అబ్దుల్ కలాం పేరు


ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించిన తర్వాతే నూతన గైడ్ లైన్స్ రూపొందించి బదిలీలు చేపట్టాలని బీజేపీ నాయకులు కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కేటాయింపులో స్థానికతను  ప్రామాణికంగా తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు మాదిరిగానే బీసీ ఉద్యోగులకూ తప్పనిసరిగా ‘ఆప్షన్ ఫార్మెట్’ కాలమ్ ను వర్తింపజేయాలన్నారు. ఉద్యోగుల బదిలీల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి బిశ్వాల్ (పీఆర్సీ) కమిటీ గుర్తించిన 1.92 లక్షల ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 


Also Read: మందుబాబులకు బంపర్ ఆఫర్.. న్యూ ఇయర్ ఈవెంట్లకు వెళ్లేవారి కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.