In Pics: హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం, వంతెనకు అబ్దుల్ కలాం పేరు
హైదరాబాద్ నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మరో భారీ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా ‘ఓవైసీ జంక్షన్ టు మిధానీ జంక్షన్’ ఫ్లై ఓవర్‌ను నిర్మించింది.
మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించి నగర ప్రజలకు అంకితం చేశారు.
కేటీఆర్‌తో పాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌కి అరుదైన గౌరవం ఇస్తూ ఫ్లై ఓవర్‌కు ఆయన పేరును నామకరణం చేశారు.
ఈ ఫ్లైఓవర్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులతో పాటు శ్రీశైలం, బెంగళూరు, కర్నూలు తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి అనుకూలంగా ఉండనుంది.
రూ.80 కోట్ల వ్యయంతో 1.36 కిలో మీటర్ల పొడవున 12 మీటర్ల వెడల్పుతో మూడు లైన్ల రహదారిగా ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు.