Beer Price Increase In Telangana: హైదరాబాద్: మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. ఏకంగా బీర్ల ధరలను 15 శాతం పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. బీర్ల ధరల పెంపు మంగళవారం (ఫిబ్రవరి 11) నుంచే అమల్లోకి రానుందని ఉత్తర్వులలో తెలిపారు. ధరల నిర్ణయ కమిటీ సూచనల మేరకు ధరల పెంపునకు అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కో బీరుపై రూ.20 నుంచి రూ.30 వరకు ధర పెరిగింది. ఇటీవల మందుబాబులు పోరాడి కింగ్ ఫిషర్ బీర్లు సాధించుకున్నారు. కింగ్ ఫిషర్ బీర్ల కొరత ఉండదని, వారికి గుడ్ న్యూస్ చెప్పింది. కానీ అంతలోనే ధరల పెపుతో బీర్ ప్రియలుకు షాకిచ్చారు.
అన్నిరకాల బ్రాండ్ల బీర్లపై 15 శాతం ప్రాథమికంగా ధర పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. దీని ప్రకారం ప్రస్తుతం రూ.150 ఉన్న లైట్ బీర్ ధర రూ.170, రూ.180 వరకి పెరగనుంది. స్ట్రాంగ్ బీరు అయితే రూ.160 నుంచి రూ.190కి ధరలు పెరగనున్నాయి. అయితే పాత స్టాకు బీర్లకు మాత్రం పాత రేటకే విక్రయించాలని ఎక్సైజ్ శాఖ సూచించింది. సాధారణంగా పాటించే రౌండింగ్ అఫ్ పద్ధతి ప్రకారం తెలంగాణలో మద్యం ధరలు పెరుగుతున్నాయని ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి.
మంత్రి అలా అన్నారు.. కానీ ధరలు పెరిగాయి..
ప్రజలపై భారం పడేందుకు అంగీకరించేది లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల చెప్పారు. కానీ అంతలోనే తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరల పెంపునకు అనుమతి ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవల ఎక్సైజ్ శాఖ సమావేశంలో కొత్త బ్రాండ్ల బీర్లకు అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ నేతల బినామీలకు చెందిన కంపెనీలతో కొత్త బీర్లు తీసుకొస్తున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
Also Read: Andhra Pradesh Liquor Rates:ఏపీలో పెరిగిన మద్యం ధరలు- రూ. 10 పెంచిన ఎక్సైజ్ శాఖ
ఏపీలో మధ్యం ధరలు పెరిగాయి. క్వార్టర్ లేదా హాఫ్ లేదా ఫుల్ బాటిల్ అనేది సంబంధం లేకుండా, బ్రాండులతో కూడా సంబంధం లేకుండా రూ.10 చొప్పున పెంచినట్లు ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు. బీరు, రూ 99 మద్యంపై మాత్రం ప్రస్తుతానికి పెంపు లేదని స్పష్టం చేశారు.