TCS Shocking News: ప్రముఖ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) హైబ్రిడ్ వర్కింగ్ పాలసీకి గుడ్ బై చెప్పింది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఉద్యోగులు అందరూ ఆఫీసుకు రాలాని సూచించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన విషయాల గురించి ఉద్యోగులకు చెప్పినట్లు తెలిపింది. వచ్చే నెల నుంచి వారంలో ఐదు రోజుల పాటు కార్యాలయాలకు వచ్చి పని చేయాల్సిందేనని వెల్లడించింది. అయితే ఇదే పద్ధతిని అన్ని కంపెనీలు ఫఆలో కాబోతున్నాయి. కరోనా సమయంలో ప్రారంభం అయిన వర్క్ ఫ్రమ్ హోమ్ అనంతరం.. ఈ హైబ్రిడ్‌ వర్క్‌ సంస్కృతి మొదలైంది. ఈ పద్ధతి వల్లే చాలా మంది ఉద్యోగులు వారంలో మూడు రోజులు మాత్రమే కార్యాయాలకు వెళ్లి మిగిలిన రెండు రోజులు ఇంటి నుంచి పని చేస్తున్నారు. కానీ కంపెనీ సీఈఓ, చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ పేరిట ఉద్యోగులు ఐదు రోజులూ కార్యాలయాలకు రావాల్సిందేనని చెబుతూ.. ఇ-మెయిల్స్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి ఉద్యోగులు కార్యాలయాలకు రావాల్సిందేనని ఆయా డివిజన్ల మేనేజర్లు సూచిస్తున్నారు.


ఉద్యోగులు అందరూ ఆఫీసుకు రావడం ఎంత అవసరమో కంపెనీ 2022-23 వార్షిక నివేదికలో స్పష్టంగా వెల్లడించింది. కంపెనీలో ఉన్న ఉద్యోగులు అంతా  2020 మార్చి తర్వాత నియమితులు అయిన వారేనని అందులో ప్రస్తావించింది. వీరంతా సీనియర్లు, లీమ్‌ లీడర్ల నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందని, వారి నడవడిక, ఆలోచనా తీరు నుంచి కొత్త వారు తెలుసుకోవాల్సింది చాలా ఉంటుందని వెల్లడించింది. ఉద్యోగులు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా అభివృద్ధి సాధ్యం కాదిన భావిస్తున్నట్లు స్పష్టం చేసింది. కాబట్టి ఈ సంవత్సరంలోనే దశల వారీగా ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయ పడ్డారు. ఇందులో భాగంగానే టీసీఎస్‌ తాజా నిర్ణయం తీసుకుంది. అయితే దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్‌లో దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.


Read Also: Infosys: టైమ్‌ బెస్ట్‌ 100 కంపెనీల్లో ఇన్ఫోసిస్‌కు చోటు! RIL ప్లేస్‌ ఏంటంటే?