తెలంగాణలో ఫిబ్రవరి 5వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకునే అవకాశం ఉంది. కరోనాపై వైద్యారోగ్యశాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. తల్లిదండ్రుల ఇష్టం మేరకు ఆన్ లైన్ , ఆఫ్ లైన్ లో విధ్యాబోధనకు అనుమతించొచ్చని పేర్కొంది. కొవిడ్ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ నివేదికలో పేర్కొంది. తెలంగాణలో 20 శాతానికి పైనే పాజిటివ్ రేటు ఉందని తెలిపింది. మరో పది, పదిహేను రోజుల్లో థర్డ్ వేవ్ ముగిసే అవకాశం ఉందని వైద్యారోగ్యశాఖ అభిప్రాయపడింది. షెడ్యూల్ ప్రకారమే.. అన్ని పరీక్షలు, ప్రవేశ పరీక్షలను నిర్వహించుకోవచ్చని తెలిపింది.  రేపు వైద్యారోగ్య శాఖ, విద్యా శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు.


కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సంక్రాంతి సెలవులు పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే.. ఇటీవలే మరో నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోని 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలకు హాజరయ్యే ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది గురించి కూడా ఆదేశాల్లో పేర్కొంది. రొటేషన్ పద్ధతిలో 50 శాతం మంది మాత్రమే.. విధులకు హాజరుకావాలని ప్రకటించింది. ఈ మేరకు జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.


ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ విద్యా సంస్థల విషయంలో ఇటీవలే.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు పొడిగించింది. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ నుంచి ప్రకటించిన సంక్రాంతి సెలవులు జనవరి 16తో ముగిశాయి. అయితే అదేరోజు సెలవులు పొడిగించాలని విద్యాశాఖకు వైద్యారోగ్య శాఖ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ సిఫార్సు మేరకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  ఆ తర్వాత 24వ తేదీ నుంచి ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని  ఆదేశాలు వెలువడ్డాయి. ఇప్పుడు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నారు.


Also Read: Online Classes: ఈ నెల 24 నుంచి ఆన్ లైన్ తరగతులు.. రొటేషన్ పద్ధతిలో విధులకు ఉపాధ్యాయులు


Also Read: Hyderabad Crime: వ్యాయామం చేస్తుండగా మందలించిన తల్లి... కోపంతో తల్లిని హత్య చేసిన కొడుకు... అడ్డొచ్చిన చెల్లిపై దాడి


Also Read: Mulugu District: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే బాలికలకు ఈ సౌకర్యం.. మంత్రి సత్యవతి రాథోడ్