చాలా తక్కువ సమయంలో బుల్లితెరపై పాపులారిటీ సంపాదించుకుంది వర్ష. 'జబర్దస్త్' షో ఆమెకి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె పలు సీరియల్స్ లో నటించింది. ఆ తరువాత 'జబర్దస్త్' షోలోకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటింది. ఇమ్మాన్యుయేల్ తో కలిసి ఆమె చేసే స్కిట్ లు యూట్యూబ్ లో వైరల్ అవుతుంటాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. 


ఓ ముగ్గురి కారణంగా తన ఫ్యామిలీ మొత్తం ఈరోజు బాధపడుతుందని వర్ష చెప్పుకొచ్చింది. అసలేమైందంటే.. వర్ష సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది వర్ష. హాస్పిటల్ బెడ్ పై ట్రీట్మెంట్ తీసుకుంటున్న తన సోదరుడి ఫొటో షేర్ చేస్తూ.. 'దయచేసి అందరినీ వేడుకుంటున్నాను.. మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముగ్గురు వ్యక్తులు నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేయడం వల్ల నా సోదరుడికి యాక్సిడెంట్‌ అయి హాస్పిటల్‌లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. మా ఫ్యామిలీ అంతా ఎంతగానో బాధపడ్డాం. అందుకే ఎవరైనా సరే డ్రైవ్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే ఎవరు కూడా, ఏ ఫ్యామిలీ కూడా, సఫర్‌ అవ్వకుండా ఉంటుంది. ప్రస్తుతం నా సోదరుడు డేంజర్ సిట్యుయేషన్ నుంచి బయటపడ్డాడు' అని వర్ష పేర్కొంది.


ఆమె పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం 'జబర్దస్త్'తో పాటు స్పెషల్ ఈవెంట్స్ లో కూడా సందడి చేస్తుంది ఈ బ్యూటీ. పండగలకు సంబంధించిన చాలా షోల్లో వర్ష హడావిడి కనిపిస్తుంటుంది. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో కూడా ఆమె కొన్ని స్కిట్ లు చేస్తోంది. 








Also Read: గ్లామర్ షో ఓకే కానీ.. ఛాన్స్ లు దొరుకుతాయా..?


Also Read: అల్లు అర్జున్, యష్ లకు కంగనా సలహా.. బాలీవుడ్ వలలో పడొద్దంటూ రిక్వెస్ట్..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి