Rahul Telangana : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తోంది. మొదటి విడత జాబితాను రిలీజ్ చేసిన హైకమాండ్.. మిగతా అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. బుజ్జగింపులు, బలహీనంగా ఉన్న చోట్ల బలమైన అభ్యర్థుల కోసం.. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ లోపు రాహుల్ గాంధీ మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్ ప్రచార సన్నాహాల్లో భాగంగా బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు.
బుధవారం నుంచి మూడు రోజుల పాటు బస్సు యాత్ర
బుధవారం నుంచి కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర మొదలుపెట్టనుంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయంలో రాహుల్, ప్రియాంక ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు రాష్ట్రంలో రాహుల్ బస్సు యాత్రలో పాల్గొననున్నారు. యాత్రలో భాగంగా రైతులు, మహిళలతో రాహుల్ సమావేశమవుతారు. అలాగే పలుచోట్ల బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 18న ములుగు, భూపాలపల్లిలో రాహుల్ పర్యటన ఉండనుండగా.. ఆ రోజున ములుగులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. 19న కరీంనగర్ జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారు. ఆ రోజున భూపాలపల్లిలో బహిరంగ సభ ఉండనుంది.
సనత్ నగర్ లో తలసానితో కోట నీలిమ ఫైట్, పద్మారావు హ్యాట్రిక్ కొడతారా ?
20న నిజామాబాద్‌లో బహిరంగసభ
20న నిజామాబాద్ జిల్లాలో రాహుల్ బస్సు యాత్రను కొనసాగించనున్నారు. ఆ రోజున ఆర్మూరులో పసుపు రైతులతో భేటీ కావడంతో పాటు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా పలు ప్రాంతాల్లో రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. దసరా తర్వాత రెండో విడత బస్సు యాత్ర ఉండనుండగా.. ఇందులో ప్రియాంకగాంధీ పాల్గొననున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మూడో విడత బస్సు యాత్ర ఉండనుండగా ఈ యాత్రలో సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే హాజరయ్యే అవకాశముంది.
తమిళనాడులో ఘోర విషాదం - బాణసంచా తయారీ కేంద్రాల్లో పేలుళ్లుతో పది మంది మృతి !
రాహు్ గాంధీ సమక్షంలో భారీగా చేరికలు
రాహుల్ గాంధీ సమక్షంలో భారీగా చేరికలు ఉండనున్నాయి. రేవూరి ప్రకాష్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావుతో పాటు పలువురు ప్రముఖులు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వివిధ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థుల ఎంపిక ఎదురు చూస్తోంది. అలాంటి చోట్ల.. పాత టీడీపీ నేతల్ని చేర్చుకుంటున్నారు. వారంతా గతంలో జిల్లాలో కీలక పాత్ర పోషించిన వారే కావడంతో.. కాంగ్రెస్ పార్టీ కూడా ఆహ్వానిస్తోంది.