Top 5 Telugu Headlines Today 17 October 2023:

  
కాంగ్రెస్ గ్యారంటీలకు మరింత ప్రచారం వచ్చేలా చేశారా? బీఆర్ఎస్ మేనిఫెస్టోపై టాకేంటి ?
భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటించారు.కొద్ది రోజులుగా ఈ మేనిఫెస్టోపై కేటీఆర్, హరీష్ రావు అంచనాల పెంచుతూ వస్తున్నారు. ప్రతిపక్షాలకు కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయ్యే మేనిఫెస్టో ప్రకటిస్తారని హరీష్ రావు తరచూ చెప్పారు. అందుకే కేసీఆర్ ఎలాంటి పథకాలు ప్రకటిస్తారోనన్న ఆసక్తి ప్రజల్లో ఏర్పడింది. రైతులకు పెన్షన్  సహా అనేక కొత్త కొత్త పథకాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే  కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోను చూసిన వారికి కాంగ్రెస్ మేనిఫెస్టోకు కౌంటర్ ఇచ్చినట్లుగా ఉంది తప్ప.. కొత్త విషయాలేం కనిపించలేదన్న ఫీడ్ బ్యాక్ వస్తోంది. పూర్తి వివరాలు


రామోజీరావు, శైలజా కిరణ్ లపై చీటింగ్ కేసు నమోదు చేసిన సీఐడీ
మార్గదర్శి వ్యవహారంలో మరో కేసు నమోదైంది. ఈసారి సంస్థ మాజీ షేర్ హోల్డర్ ఫిర్యాదు చేశారు. మార్గదర్శి వ్యవస్థాపకులలో ఒకరైన జి. జగన్నాథ రెడ్డి కుమారుడు గాదిరెడ్డి యూరిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు, ఆయన కోడలు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజా కిరణ్ లపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. సెక్షన్ 42O, 467, 120-8, రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. కేసులో ఏ1గా రామోజీరావు, ఏ2గా శైలజా కిరణ్ ను చేర్చారు. మార్గదర్శిలో తమ షేర్ల వాటాను శైలజ పేరు మీదకి మార్చారని, తనను బెదిరించి బలవంతంగా తన వాటా లాక్కున్నారని యూరిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వాటా షేర్లు రాసివ్వడానికి నిరాకరించడంతో రామోజీరావు తుపాకీతో తనను బెదిరించి, బలవంతంగా లాక్కున్నారని యూరిరెడ్డి ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు


కోడికత్తి దాడి కేసు విచారణపై ఏపీ హైకోర్టు స్టే - ఎన్ఐఏకు నోటీసులు
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన  కోడికత్తి కేసు విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. విచారణను ఎనిమిది వారాల పాటు నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కోడికత్తి కేసులో లోతైన విచారణ జరపాలిని బాధితుడు జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు.  గతంలో ఎన్ఐఏ కోర్టు తోసిపుచ్చడంతో ఎన్‌ఐఏ కోర్టు  ఉత్తర్వులను హైకోర్టులో జగన్  సవాల్ చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్‌ఐఏకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఆరు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. పూర్తి వివరాలు


అధికార పార్టీలో చిచ్చురేపుతున్న నకిలీ భూ దస్తావేజుల కేసు, గన్ మెన్లను సరెండర్ చేసిన మాజీ మంత్రి బాలినేని
మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మరోసారి కోపమొచ్చింది. తన గన్ మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి బాలినేని లేఖ రాశారు. కొంతకాలంగా ఒంగోలు పోలీసుల వ్యవహారశైలిపై బాలినేని అసంతృప్తితో రగిలిపోతున్నారు. ప్రకాశం జిల్లాలో నకిలీ భూ దస్తావేజుల కేసులో తీరుపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా గన్‌మెన్‌లను ప్రభుత్వానికి తక్షణమే సరెండర్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. నకిలీ భూపత్రాల కేసులో ఇప్పటి వరకు 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టవద్దని మూడు రోజుల క్రితం కలెక్టర్‌ సమక్షంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎస్పీని కోరారు. పూర్తి వివరాలు


కాంగ్రెస్‌లో జోరుగా చేరికలు - తాజాగా ఎవరెవరు చేరారంటే ?
 బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బోథ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బాపురావును బీఆర్ఎస్ అధిష్టానం పక్కనబెట్టేసి ఆ స్థానాన్ని అనిల్ జాదవ్‌కి కేటాయించింది. దీంతో ఆయన బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ఇతర నేతలు కాంగ్రెస్‌లో చేరారు. పూర్తి వివరాలు