తెలంగాణలో హుజూరాబాద్ దళిత బంధు సమావేశం 16వ తేదీన జరిగితే బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పుడు మాట్లాడుతున్నాడని.. ఆయన వ్యవహారం చూస్తే దొంగలు పడ్డంక ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఉందని పీయూసీ చైర్మన్ ఏ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీపై, ఎంపీ ధర్మపురి అరవింద్‌పై జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పసుపు అంటే హిందువులకు పవిత్రమైనదని, అలాంటి పసుపుతోనే అరవింద్ పెట్టుకున్నాడన్నారు. నిజామాబాద్‌కు పసుపు బోర్డు తెస్తానని ఫేక్ బాండ్ పేపర్ రాసిచ్చిన ఫేక్ ఎంపీ ధర్మపురి అరవింద్ అని ఆరోపించారు.
బీజేపీ అంటే బిగ్ జోకర్స్ పార్టీ అని, ఆ పార్టీ బిగ్ లోఫర్ అరవింద్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి పసుపు బోర్డు తీసుకురాలేని వ్యక్తి కూడా తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురించి మాట్లాడే అర్హత, స్థాయి ఉందా అని ప్రశ్నించారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్, బీజేపీ నేతలని.. కాంగ్రెస్ పార్టీ అంటే జైలు, బెయిల్ పార్టీ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒకే ఇంట్లో మూడు పార్టీలు ఉన్న అరవింద్ ముందు ఇంట గెలవకుండా రచ్చ గెలుస్తాడా అని ఎ.జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Also Read: MP Arvind: కేసీఆర్ రెండో కొడుకు రేవంత్, అప్పటికల్లా సీఎం మనవడు ముసలోడు అయితడు.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు
‘తండ్రి డీఎస్ పీసీసీ అధ్యక్షుడిగా టికెట్‌లు ఇస్తే డబ్బులు తీసుకున్న వ్యక్తివి నువ్వు. ఇదే విషయాన్ని అప్పటి డీసీసీ అధ్యక్షుడు గంగాధర్ స్వయంగా చెప్పారు. ప్రపంచం మెచ్చిన పథకం మిషన్ భగీరథ. కేంద్ర మంత్రి షెకావత్ మిషన్ భగీరథ పథకాన్ని పార్లమెంట్‌లో పొగిడింది అరవింద్‌కు కనిపంచలేదా. కరెంట్ సరిగా ఇవ్వడం లేదని మా ప్రభుత్వంపై ఈ ఫేక్ ఎంపీ విమర్శలు చేస్తున్నాడు. మేం ఇచ్చే కరెంట్‌పై కేంద్రం ప్రశంసలు కురిపించింది. 28 మంది అవినీతి పరులను దేశం దాటించిన ఘనత బీజేపీది.
Also Read: Harish In Etala Position : ప్రతీ చోటా ఈటలకు ప్రత్యర్థిగా హరీష్..! పక్కా ప్లానేనా..?
జైలుకు వెళ్లొచ్చిన నేత రేవంత్ రెడ్డి..
గతంలో జైలుకు వెళ్లొచ్చిన నేత రేవంత్ రెడ్డి కూడా అవినీతి గురించి మాట్లాడితే విడ్డూరంగా ఉంది. టీఆర్ఎస్ గురించి మాట్లాడే ముందు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో వారసత్వ రాజకీయాల గురించి తెలుసుకుంటే మంచిది. కేసీఆర్ పాలన సరిగా లేకపోతే ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను కేంద్రం సైతం కాపీ కొడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్రం నిధులు నయా పైసా ఇవ్వడం లేదు. అభివృద్ధి ,సంక్షేమం గురించి మాట్లాడం చేతకాకనే అరవింద్ దుష్ప్రచారం చేస్తున్నారు. దమ్ముంటే ప్రధాని మోదీతో మాట్లాడి తెలంగాణకు పసుపు బోర్డు తెప్పించు. నీ పేరులో ధర్మ ఉంది కానీ చేసేవన్నీ అధర్మపు పనులే. బీజేపీ నేతలు మోకాళ్ల మీద నడిచిన, ఎన్ని పాదయాత్రలు చేసినా తెలంగాణలో అధికారంలోకి రాదని’ టీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి అన్నారు.
Also Read: Raksha Bandhan: అన్నకు రాఖీ కట్టని షర్మిల... ట్వీట్టర్ ద్వారా శుభాకాంక్షలు.. కారణం ఇదేనా..!