రాజకీయాల్లో శత్రువులైనా... ఆఫ్ ద రికార్డ్ మంచి మిత్రులే. మైక్ ముందు ఇష్టం వచ్చినట్లు తిట్టుకున్నా... మైక్ ఆఫ్ చేస్తే హాస్యపు పలకరింపులు ఉంటాయి. తెలంగాణలో రాజన్న రాజ్యం తేస్తానంటూ వైఎస్ఆర్టీపీ స్థాపించిన వైఎస్ షర్మిల ఈ ఏడాది తన అన్న, ఏపీ సీఎం జగన్ కు రాఖీ కట్టలేదు. కానీ ట్వీట్టర్ ద్వారా "నా తోడ బుట్టిన జగనన్నకు రాఖీ శుభాకాంక్షలు" అని తెలిపారు.
సొంత మీడియాపై వ్యాఖ్యలు
తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటానికి పార్టీ పెట్టానని వైఎస్ షర్మిల చెబుతున్నారు. ఆమె రాజకీయాల్లోకి రావడానికి అన్నా, చెల్లెలు మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఈ ప్రచారాన్ని ముందు ఎవరూ నమ్మలేదు. తాజా పరిస్థితులు ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. మొదట్లోనే వైఎస్ షర్మిల, జగన్ సొంత మీడియా సంస్థపై బహిరంగానే కొన్ని కామెంట్స్ చేశారు. మీరు మాకు కవరేజ్ ఇవ్వరులే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ రాజకీయాల్లో భాగమని అందరూ భావించారు.
వైఎస్ షర్మిల పార్టీ పెట్టిన తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరుగుతున్న సందర్భాలే కనిపిస్తున్నాయి. రాజకీయ పార్టీ పెట్టిన అనంతరం ఇప్పటి వరకూ అన్న జగన్‌తో షర్మిల భేటీ కాలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కూడా తల్లి విజయమ్మతో కలిసి మాత్రమే ఇడుపులపాయలో కనిపించారు. సీఎం జగన్ నివాళులు అర్పించినప్పుడు కూడా షర్మిల ఎక్కడా కనిపించలేదు.
Also Read: Jagan Sharmila Rakhi : జగన్‌కు రాఖీ కట్టేందుకు షర్మిల వెళ్తారా..?
తాజాగా ఇవాళ రాఖీ పౌర్ణమి సందర్భంగా షర్మిల ఇదే వైఖరిని అవలంభించారు. ఇప్పటి వరకూ చాలా మంది రాజకీయంగా విరుద్ధంగా ఉన్నా కుటుంబ సంబంధాలు మాత్రం కొనసాగించేవారు. ఒకే ఇంట్లో మూడు నాలుగు రాజకీయ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు. కుటుంబ సంబంధాల్లో రాజకీయాలు అడ్డురాకుండా చూసుకునేవారు. కాని షర్మిల మాత్రం ఇలా వ్యవహరించడంలేదని అనుకోవచ్చు.
Also Read: Watch: 10 ఏళ్ల నుంచి మంత్రి హరీశ్ రావుకు తొలి రాఖీ కట్టేది ఈమెనే..
Also Read: Keerthy Suresh Photos: కీర్తి సురేష్ ఓనమ్ సెలబ్రేషన్.. ట్రెడీషనల్ లుక్‌లో ‘మహానటి’ ఫొటోస్