BC Sabha : హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కి ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేశారు. శుక్రవారం ఇందిరా పార్క్ బీసీ సభ కు అనుమతి ఇవ్వాలని కోరారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బీసీ సభను తలపెట్టామన్నారు.పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకున్న భారీగా చేరుకుంటున్నారు బిసి సంఘాల నేతలు.. సావిత్రి పూలే జయంతి రోజున తలపెట్టిన బిసి మహా సభకు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రభుత్వం తీరుపై బిసి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కును రాజ్యంగం కల్పించిందని.. రాజ్యాంగం పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నీరంకుశత్వం ఎందని ప్రభుత్వ తీరును తీవ్రంగా బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
ఎన్నికల సమయంలో బీసీలకు హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చాక వారికి కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని కవిత విమర్శిస్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇప్పుడు అటకెక్కాయని విమర్శించారు. సావిత్రీ బాయి ఫూలే జయంతి సందర్భంగా సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేయడానికి శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇందిరా పార్కు వద్ద బీసీ మహాసభ నిర్వహిస్తున్నట్లు కవిత తెలిపారు.
లిక్కర్ కేసులో అరెస్టు అయి.. బెయిల్ పై రిలీజయిన తర్వాత కవిత చాలా రోజులు సైలెంట్ గా ఉన్నారు. ఇటీవలే మళ్లీ దరాజకీయంగా యాక్టివ్ అయ్యారు. జాగృతి తరపున పలు రాజకీయ కార్యక్రమాలు ని ర్వహిస్తున్నారు. తాజాగా బీసీ నినాదాన్ని అందుకున్నారు. బీసీ సంఘాలతో కలిసి రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారు.