దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. 'ఎస్ఎస్ఎంబీ 29' (SSMB29) అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా ఈ రోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మేకర్స్ ఏ మాత్రం చడీ చప్పుడు చేయకుండా, ఈ మూవీని లాంచ్ చేశారు. జక్కన్న ఒక్క ఫో


సైలెంట్‌గా 'ఎస్ఎస్ఎంబీ 29' మూవీ లాంచ్ 
రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న 'ఎస్ఎస్ఎంబీ 29' అనే మూవీ ఎప్పుడు మొదలవుతుందా? అని కళ్ళల్లో వత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. నిజానికి 'ఆర్ఆర్ఆర్' మూవీ రిలీజ్ అయిన వెంటనే మహేష్ బాబు - రాజమౌళి సినిమా తెరపైకి వెళ్లనుందని రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఈ విషయాన్ని ముందుగా రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ లీక్ చేశారు. ఆ తర్వాత ఒకానొక సందర్భంలో జక్కన్న స్వయంగా మహేష్ బాబుతో సినిమా ఉండబోతుందని కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. అయితే ఈ మూవీ గురించి రాజమౌళి ప్రకటించి చాలా కాలమే అవుతుంది. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కానీ, పూజా కార్యక్రమాలు కానీ ఇప్పటిదాకా చోటు చేసుకోలేదు. మధ్య మధ్యలో రాజమౌళి మూవీ లొకేషన్ల కోసం సర్చ్ చేయడం, అలాగే నటీనటుల ఎంపిక వంటి విషయాలపై కొన్ని లీక్స్ వచ్చాయి. అంతకంటే ఎక్కువగా రూమర్లు వచ్చాయి. 


వీటన్నింటినీ పట్టించుకోకుండా రాజమౌళి సైలెంట్ గా తన సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తూ వచ్చారు ఇన్ని రోజులు దాకా. ఇక ఎట్టకేలకు 'ఎస్ఎస్ఎంబీ 29' ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు తాజాగా హైదరాబాద్లో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో గురువారం రోజు ఈ వేడుక నిర్వహించగా, అందులో 'ఎస్ఎస్ఎంబీ 29'తో పాటు మహేష్ బాబు పాల్గొన్నారని తెలుస్తోంది. కానీ ఈ సినిమా లాంచ్ ఈవెంట్ కు బయట వారికి, కనీసం మీడియా వారికి కూడా అనుమతి లేదని తెలుస్తోంది. దీంతో పూజా కార్యక్రమానికి సంబంధించి ఇప్పటిదాకా ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ లేదా ఫోటోలు బయటకు రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కొన్ని ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. 


Also Readరాజమౌళి సినిమాకు రెమ్యూనరేషన్ వద్దని చెప్పిన మహేష్ బాబు - ఎందుకంటే?



ఆరు దేశాలలో షూటింగ్ 
కాగా వేసవి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోందని తెలుస్తోంది. మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్లో రనున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఆరు దేశాల్లో జరగబోతోందని సమాచారం. ఈ సినిమా కోసం రాజమౌళి ఒడిశా, ఆఫ్రికాలోని అడవులు పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రెండు భాగాలుగా రిలీజ్ కాబోతుందని, ఫస్ట్ పార్ట్ ను 2027 లో రిలీజ్ చేయబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అత్యంత భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, పృథ్వీరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్రలో నటించబోతున్నారని అంటున్నారు. కానీ వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే జక్కన్న నుంచి ఒక్క ప్రెస్ మీట్ పిలుపు రావాల్సిందే. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు.  ఇక గతంలో తన సినిమాల పూజా కార్యక్రమాలకు డుమ్మా కొట్టిన మహేష్ బాబు 'ఎస్ఎస్ఎంబీ 29' కోసం మాత్రం ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేశారు.


Read Also: సెంటిమెంట్ పక్కన పెట్టిన మహేష్ బాబు... SSMB29 ప్రారంభోత్సవానికి హాజరు