Man stabbed 24 times in Keralas Thrissur for not wishing assailant Happy New Year: అడిగి మరీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పించుకోవడం కామెడీ అవుతుంది. కానీ ఆతను చెప్పడం లేదు. ఎంత సేపు చూసినా చెప్పలేదు. చివరికి రోడ్ల మీద అందరూ హ్యాపీ న్యూయర్ చెప్పుకుంటున్నారు. అయినా తనను పట్టించుకోలేదని ఓ వ్యక్తి ఊగిపోయాడు. వెంట తెచ్చుకున్న కత్తితో తనకు హ్యాపీ న్యూఇయర్ చెప్పని వ్యక్తిపై దాడికి దిగాడు. ఒకటి కాదు..రెండు కాదుఏకంగా ఇరవై నాలుగు సార్లు కత్తితో పొడిచేశాడు. అతని ఆవేశం చూసి ఏదో జరిగిపోయిందాని చాలా మంది అనుకున్నారు. కానీ హ్యాపీ న్యూ ఇయర్ మాత్రమే చెప్పలేదని అందుకే పొడిచేశాడని తెలిసేసరికి అందరూ నోరెళ్లబెట్టారు.
కేరళలోని త్రిస్సూర్‌లో ఈ ఘటన జరిగింది. డిసెంబర్ 31 నాడు యువకులు అందరూ బైక్ రైడింగ్ చేస్తూ కనిపించిన వారికి హ్యాపీ న్యూయర్ చెబుతూ వెళ్తున్నారు ఇలా రోడ్లు అన్నీ సందడిగా ఉన్నాయి. సాహిబ్ అనే వ్యక్తి, రఫీ అనే వ్యక్తిని హ్యాపీ న్యూయర్ అని విష్ చేశాడు. కానీ సాహిబ్ మాత్రం విష్ చేయలేదు. దాంతో నడిరోడ్డుపైనా సాహిబ్ పై దాడి చేశాడు. కత్తితో పొడిచేశాడు. ఇద్దరూ కామన్ ఫ్రెండ్సేనని అయితే వివాదాల వల్ల మాట్లాడుకోవడం లేదని భావిస్తున్నారు.
Also Read : Crime News: ఆ బిడ్డ తనకు పుట్టలేదని అనుమానం - 9 నెలల చిన్నారికి యాసిడ్ తాగించేశాడు, ఒంగోలులో దారుణం