Today Top Headlines In Ap And Telangana:


1. జగన్ అరెస్టుపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు


ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు రాజకీయాలు ఎక్కువ అయ్యాయని ప్రతిపక్షం వైసీపీ ఆరోపిస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బహిరంగంగానే ఈ కామెంట్స్ చేశారు. ఆయనతో పాటు లీడర్లు, కేడర్‌ రోజూ సోషల్ మీడియాలో దీనిపై చర్చిస్తూనే ఉన్నారు. అయితే అలాంటిదేమీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తన లక్ష్యం వేరని తేల్చిచెప్పారు. 2024లో ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ప్రజలు చారిత్రక విజయం ఇచ్చారని అన్నారు చంద్రబాబు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి మంచి పాలన అందివ్వడమే తన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇంకా చదవండి.


2. 2024లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?


గతేడాదికి సంబంధించి తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం వివరాలు వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం. 2024 సంవత్సర కాలంలో తిరుమలేశుడికి హుండీ ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం సమకూరింది. 2024 లో శ్రీనివాసుడిని దర్శించుకున్న భక్తుల సంఖ్య -  2.55 కోట్లు. 2024 లో తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య -  99 లక్షలు. 2024లో అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య -  6.30 కోట్లు. 2024లో విక్రయించిన లడ్డూల సంఖ్య  - 12.14 కోట్లు. ఇంకా చదవండి.


3. బాపట్ల జిల్లాలో దారుణ ఘటన


బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలంలో దారుణం జరిగింది. కొత్త సంవత్సరం తొలిరోజునే భర్త ప్రాణాలు తీసిందో భార్య. తాగి వచ్చి పెట్టి హంసను ఇన్నేళ్లు భరించిన భార్య ఇప్పుడు తిరగబడి ప్రాణాలు తీసింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే పతి ప్రాణాలు తీసేసింది. మండలంలోని కొత్త పాలెంలో ఈ ఘటన జరిగింది. అమరేంద్ర, అరుణ భార్యాభర్తలు. అమరేంద్ర తాగుడుకు బానిసై నిత్యం భార్యను హింసించేవాడు. డబ్బులు కోసం, భోజనం దగ్గర ప్రతి విషయంలో హింసించేవాడు. ఆ ఇంట్లో కొట్లాట రోజూ మామూలు వ్యవహారంలా మారిపోయింది. ఇంకా చదవండి.


4. సంధ్య థియేటర్ కేసులో కీలక మలుపు


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్త సంవత్సరం రోజున ఈ కేసుకు సంబంధించిన రెండు కీలక పరిణామాలు జరిగాయి. ఈ కేసులో జాతీయ మానవహక్కుల కమిషన్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో నిర్మాతలను అరెస్టు చేయొద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. డిసెంబర్‌ 4న పుష్ప-2 ప్రీ రిలీజ్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, ఓ బాలుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఇంకా చదవండి.


5. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం


తెలంగాణలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టల్స్ నిర్వహణపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఫుడ్ సరిగా లేదని, నిర్వహణ అధ్వాన్నంగా ఉందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే అప్పుడప్పుడు ఫుడ్‌పాయిజన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. పదుల సంఖ్యలో విద్యార్థులు ఆసుపత్రిలో చేరుతున్నారు. విష సర్పాలు కూడా తిరుగుతున్నాయని ఈ మధ్య విమర్శలు వెల్లువెత్తాయి. ఇంకా చదవండి.