సమాచార హక్కుచట్టాన్ని తెలంగాణ సర్కార్ నిర్వీర్యం చేస్తోందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. సమాచార హక్కు దరఖాస్తులపై చీఫ్ సెక్రటరీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని పిటిషనర్ రాపోలు భాస్కర్ కోరారు. సమాచార హక్కు చట్టం కింద ఏ శాఖకు సంబంధించిన సమాచారమైనా తెల్సుకునే వీలుకు ప్రభుత్వం బ్రేక్ వేసింది. గత వారం తెలంగాణ ప్రభుత్వం .. ఆర్టీఐ చట్టాల కింద ఎలాంటి సమాచారం చెప్పాలన్నా .. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నా సరే చెప్పొద్దని.. తమ అనుమతి ఉండాల్సిందేనని ఆదేశాలిచ్చింది.  


Also Read : దళిత బంధు అమలుపై ముగిసిన వాదనలు.... తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు


పథకాలు, లబ్దిదారులు, ప్రభుత్వ నిర్ణయాలు.. ఇలా ఏదైనా సమాచారం తెలుసుకునే హక్కు పౌరులకు ఉంది. సమాచార హక్కు చట్టంకింద ఓ దరఖాస్తు చేస్తే మొత్తం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. కానీ ఇప్పుడు అవి వివాదాస్పదం అవుతున్నాయన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి ముందుగా అనుమతి తీసుకోకుండా ఆర్టీఐ దరఖాస్తులకు సమాచారం ఇవ్వడానికి వీల్లేదని జీవో ఇచ్చింది. జీవోప్రకారం గ్రామస్థాయిలో ప్రభుత్వ కార్యాలయంలో ఏ చిన్న సమాచారం కోసం ఆర్టీఐ దరఖాస్తు చేసినా.. రాష్ట్రస్థాయి అధికారుల అనుమతి కావాలి.


Also Read : ఎన్‌కౌంటర్‌ కేసులో ముందుగా విచారించొద్దు.. దిశ కమిషన్‌పై కోర్టుకెళ్లిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ !


రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసిన ఉత్తర్వు చట్ట వ్యతిరేకమే కాకుండా రాజ్యాంగం ప్రసాదించిన పౌరుల ప్రాథమిక హక్కుకూ విఘాతం కల్పించడమే అని పిటిషనర్ చెబుతున్నారు.  సమాచారం పొందడం ప్రజల హక్కు అని ఆర్టీఐ చట్టం పేర్కొంటుండగా.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 9(1)(ఏ) ప్రసాదించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ సైతం సమాచారం పొందే స్వేచ్ఛనే తెలియజేస్తుందని సుప్రీంకోర్టు పలుమార్లు వెలువరించిన తీర్పుల్లో స్పష్టం చేసింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు పౌరుల ప్రాథమిక హక్కునూ హరించేలా ఉన్నాయని పిటిషనర్ వాదిస్తున్నారు. 


Also Read : మాజీ ఎమ్మెల్యే కొడుకు ఐఏఎస్.. కానీ ఆయన చేసిన పనే కేస్ అయింది !


ప్రతీ దానికి రాష్ట్ర స్థాయి అధికారుల అనుమతి ఇవ్వాలంటే  ఏళ్లకేళ్లుగడిచిపోతాయి. ఇటీవల ప్రభుత్వంపై హైకోర్టులో దాఖలవుతున్న అనేక కేసుల్లో ఆర్టీఐ చట్టం ద్వారా సేకరించిన సమాచారాన్ని ఉపయోగించుకున్నారు. భూముల వేలం విషయంలోనూ అదే జరిగింది. హైకోర్టు భూముల వేలంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి కొంత మంది పాతరికార్డులను సమాచార హక్కు చట్టం కింద సేకరించి  హైకోర్టుకు సమర్పించడమేనని భావిస్తున్నారు. అందుకే తెలంగాణ సర్కార్ వివాదాస్పద ఉత్తర్వులు ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. ఇప్పుడీ అంశంపై హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. 


Watch Video : అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నవతెలంగాణ నిర్మాత కేసీఆర్ ప్రస్థానం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి