Telangana Cm Kcr:అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నవతెలంగాణ నిర్మాత కేసీఆర్ ప్రస్థానం

" చరిత్రలో నాయకులు పుట్టలేదు..  నాయకులే చరిత్రలో నిలిచిపోయారు " .. సమయం, సందర్భం వచ్చినప్పుడు చరిత్ర ఓ నాయకున్ని తయారుచేసుకుంటుంది. అతడు లక్ష్యం వైపు గురిపెట్టి అస్ర్తాన్ని సంధిస్తాడు. విజయం సాధిస్తాడు. అలాంటి వారే చరిత్రలో ఉంటారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ ఇలాంటి నాయకుడే. తెలంగాణ అంటే కేసీఆర్ గుర్తుకు వస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ అనే రాష్ట్రం ఉనికిలోకి వచ్చిందంటే ఆయన నాయకత్వం వల్లనే. ఆయన నాయకత్వం వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి వల్లనే. 20 ఏళ్ల క్రితం 2001 ఏప్రిల్‌ 27 నాడు జలదృశ్యంలో పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి నేడు దేశ రాజకీయ వ్యవస్థలోనే తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్నిదక్కించుకుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola