గత కొన్ని రోజుల పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో వినియోగదారులకు కాస్త ఉపశమనం లభించింది. ఇక తాజాగా మంగళవారం దేశంలో పలు ప్రధాన నగరాల్లో ఇంధన ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపించాయి. తెలంగాణలో స్థిరంగా కొనసాగుతుంటే, ఏపీలో కొన్ని చోట్ల మాత్రం ధరల్లో పెరుగుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలోని పెట్రోల్, డీజిల్ ధరలు
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న ధరలతో పోలిస్తే పెద్దగా వ్యత్యాసంలేదు. రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.54, లీటర్ డీజిల్ ధర రూ. 96.99గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.06 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.96.53గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.71గా ఉండగా, లీటర్ డీజిల్ ధర ధర రూ.97.13గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.62గా ఉండగా, డీజిల్ ధర రూ. 97.05గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.97గా ఉండగా డీజిల్ ధర రూ.97.40గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.54, డీజిల్ ధర రూ.96.99గా ఉంది.
ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.67, లీటర్ డీజిల్ ధర రూ.98.62 వద్ద ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.73 ఉండగా డీజిల్ ధర రూ. 97.70 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.97గా ఉండగా డీజిల్ ధర రూ.98.90గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 107.67, డీజిల్ రూ.98.62 వద్ద ఉంది. చిత్తూరు జిల్లాలో పెట్రోల ధర108.36, డీజిల్ ధర రూ.99.21 వద్ద ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో
దేశ రాజధాని దిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.49వద్ద ఉండగా, డీజిల్ ధర రూ. 88.92గా ఉంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.52, లీటర్ డీజిల్ ధర రూ.96.48గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 99.20ఉండగా డీజిల్ ధర రూ.93.52లకు లభిస్తోంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.82, డీజిల్ ధర రూ. 91.98గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.98, డీజిల్ ధర రూ.94.34 గా ఉంది.
Also Read: Weather Updates: రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు... పలు జిల్లాల్లో భారీ వర్షాలు