తెలుగు రాష్ట్రల్లో రానున్న మూడు రోజుల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. ఏపీలో ఒకటి రెండు జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తాయని, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీలో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఛత్తీస్ గడ్ పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. రుతుపవన ద్రోణి, అల్పపీడనం, విశాఖపట్నం మీదగా ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుందని వాతావరావణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
ఉత్తర కోస్తాలో
ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేకచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
దక్షిణ కోస్తాలో
మంగళవారం దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణం కేంద్రం వెల్లడించింది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రాయలసీమలో
ఇవాళ రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
Also Read: Liver Health: కాలేయాన్ని కాపాడుకోవాలంటే.. వీటిని తప్పకుండా తినాలి, లేకపోతే మూల్యం తప్పదు..
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. భైంసా మండలం మహాగామ్ – గుండెగావ్ గ్రామాల గల బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించడంతో ఆ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయు.
తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడడంతో తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులు కదులుతున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
ఆదిలాబాద్, కుమురం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.