దేశంలో  హైదరాబాద్, ముంబయి, చెన్నై, ఢిల్లీ సహా అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో ఇంధన ధరలు గత నెల రోజులకు పైగా స్థిరంగానే ఉంటున్నాయి. కొన్నిప్రధాన నగరాల్లో మాత్రం స్వల్పంగా వ్యత్యాసం కనిపించింది.  


తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబరు 25న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.105.40 కాగా.. డీజిల్ ధర రూ.96.69 గా ఉంది. ఇక వరంగల్‌, కరీంనగర్ లోనూ స్వల్ప వ్యత్యాసంతో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. 
విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నిన్న .107.39 కాగా ఈ రోజు రూ.106.35 ఉంది.  విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.106.36గా ఉంది. డీజిల్ ధర రూ.97.37గా  ఉంది. విజయవాడ, విశాఖలో కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి. తిరుపతిలో  లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం శుక్రవారం రూ.107.66 ఉండగా... కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఇక డీజిల్ ధర కూడా రూ.0.40 పైసలు పెరిగి రూ.98.53గా ఉంది. వివిధ నగరాల్లో లీటరు పెట్రోలు ధర గమనిస్తే...ఆగ్రాలో రూ.98.19, అహ్మదాబాద్ లో రూ. 98.17,  అలహాబాద్ లో రూ .98.51, ఔరంగాబాద్ లో రూ.108.71, బెంగళూరులో రూ.104.84, భోపాల్ లో రూ. 
109.77, భువనేశ్వర్ రూ. 102.18, చండీఘడ్ రూ. 97.53, చెన్నై రూ.99.08, కోయంబత్తూర్ రూ.99.55 ఉంది.


Also Read: ఈ రోజు మేషం, వృషభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి..ఆ రాశులవారికి ఒత్తిడి దూరమవుతుంది


ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా సెప్టెంబరు 24 నాటి ధరల ప్రకారం 73.62 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.


Also Read: పసిడి ప్రియులకు గూడ్‌న్యూస్! ఈ రోజు కూడా తగ్గిన బంగారం ధర, ఆ బాటలోనే వెండి కూడా..


Also Read: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక


Also Read: పాటల తోటమాలి మనల్ని వదిలి నేటికి ఏడాది.. నీ పాట మిగిలే ఉంది.. మిగిలే ఉంటుంది..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి