2021 సెప్టెంబరు 25 శనివారం రాశిఫలాలు


మేషం: ఆఫీసులో సహోద్యోగి కారణంగా కొంత టెన్షన్ ఉంటుంది. పాత స్నేహితులను కలుస్తారు. విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపుతారు. ఆస్తికి సంబంధించిన పనులు ముందుకు సాగుతాయి. ఖర్చు ఎక్కువగా ఉండొచ్చు. ఏదైనా వివాదంలో చిక్కుకునే అవకాశం ఉంది.  పనిపై వెళ్తున్నప్పుడు పెద్దల ఆశీర్వాదాలు తీసుకోండి. మీ ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి.జీవిత భాగస్వామితో కొంత గందరగోళం ఉండవచ్చు. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు.
వృషభం: వ్యాపారంలో నష్టాలు రావొచ్చు. ప్రవర్తనలో దూకుడు తగ్గించండి.  కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనైనా వివాదానికి అవకాశం ఉంది. చట్టపరమైన విషయాలు ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. లావాదేవీ చేస్తున్నప్పుడు అన్ని వివరాలను జాగ్రత్తగా చూసుకోండి.  పూర్వీకుల ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది.  సలహా ఇవ్వడం మానుకోండి. పని ఒత్తిడి ఉంటుంది.  బంధువులను కలుస్తారు. విద్యార్థులు విజయం సాధిస్తారు.
మిథునం: కొత్తగా చేపట్టే పని ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని అవసరాల నిమిత్తం అప్పులు చేయవచ్చు. యువత ఉద్యోగం సాధిస్తారు. దంపతులు సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  కార్యాలయంలో ప్రత్యర్థుల నుంచి అప్రమత్తంగా ఉండండి. మీ వ్యక్తిగత విషయాలు ఎవరికీ చెప్పకండి. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి చర్చలు వద్దు.  కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ రోజు మిశ్రమంగా ఉంటుంది. స్నేహితుల నుంచి విచారకరమైన వార్తలు వింటారు.  వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. 
కర్కాటక రాశి:  కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి.  మీరు సంతోషంగా ఉంటారు. చేపట్టిన  పని ముందుకు సాగుతుంది. ఆనందంగా ఉంటారు.  అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందుతారు.  అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. మాట మీద సంయమనం పాటించాలి . బంధువుల నుంచి శుభవార్త వింటారు. ఈ రోజు ఎక్కువ ఖర్చులు ఉంటాయి.  మీరు అప్పుల నుంచి బయటపడొచ్చు. కొత్త పెట్టుబడుల కోసం ప్రణాళికలు తయారు చేయవచ్చు.


Also Read: ఈ యూనివర్శిటీలో సిలబస్ ఉండదు...కోర్సుకి కాలపరిమితి లేదు…పరీక్షలుండవు.. నేర్చుకున్న విద్యే కొలమానం…
సింహం: మీకు అదృష్టం తోడవుతుంది.  సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆనందంగా ఉంటారు. ఈ రోజంతా  బాగుంటుంది. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలి. డబ్బు సంపాదించే అవకాశం ఉంది. మీరు స్నేహితుడిని కలవవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయడానికి ప్రయత్నించండి. విద్యార్థులు కష్టపడి పనిచేయాలి. 
కన్య: అత్తమామల వైపు నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. మీ సలహాతో చాలా మంది పనులు పూర్తవుతాయి.  ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. ఎవరితోనైనా విభేదాలు పరిష్కారమయ్యే  అవకాశం ఉంది.  బంధువులను కలుస్తారు.
తుల: బంధువులను కలుస్తారు. చేపట్టిన పనులు పూర్తవుతాయి.  కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. డబ్బు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పరిచయం లేని వ్యక్తులకు దూరంగా ఉండండి. బాధ్యతలు నిర్వర్తించగలుగుతారు. పిల్లల వైపు నుంచి శుభవార్త ఉంటుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఒకరి ఆరోగ్యం క్షీణించడం గురించి మీరు ఆందోళన చెందుతారు. జీవిత భాగస్వామి నుంచి సహకారం లభిస్తుంది. పాత పెట్టుబడి నుంచి ప్రయోజనం పొందుతారు. ఈరోజు అవసరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు.
వృశ్చికం: ఇబ్బందులు తగ్గుతాయి. కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. మీ ప్రవర్తనలో సానుకూలత ఉంటుంది. మీ మనస్సు భగవంతుని ఆరాధనలో నిమగ్నమై ఉంటుంది. అర్థరాత్రి వరకు పని చేయవద్దు. ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 


Also Read: రుద్రాక్ష చెట్టు ఇంట్లోనే పెంచుకోవచ్చు…ఎలాగో తెలుసా?
ధనుస్సు: సామాజిక పనిపై ఆసక్తి చూపుతారు. ఆఫీసులో మరింత బాధ్యత పెరుగుతుంది. చాలా పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యుడితో అభిప్రాయభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు బంధువుల నుంచి దుర్వార్తలు వింటారు.  బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.  మీ ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. 
మకరం: చేపట్టిన పనులు పూర్తవుతాయి.  అదృష్టం కలిసొస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.  కుటుంబ సభ్యులతో మధురానుభూతి ఉంటుంది.  ఈ రోజు మీ ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు. అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వొద్దు. ప్రత్యర్థుల కదలికలపై నిఘా ఉంచండి.
కుంభం: ఆఫీసులో మరింత బాధ్యత  పెరుగుతుంది. బదిలీ నోటీసులు రావొచ్చు. అప్పిచ్చిన మొత్తాన్ని ఈ రోజు తిరిగి పొందే అవకాశం ఉంది.  మీ ప్రవర్తనలో సానుకూలత ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. తెలియని వ్యక్తులకు దూరంగా ఉండండి. మీ ప్రత్యర్థులు మీకు హాని చేయడానికి ప్రయత్నించవచ్చు. రిస్క్ తీసుకోకండి. బంధువులతో చర్చించవచ్చు. 
మీనం: వ్యాపారం బాగా సాగుతుంది. తొందరగా అలసిపోతారు.  ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు. కారణం లేకుండా ఖర్చు చేయవద్దు. పూజలపై ఆసక్తి ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందుతారు. వివాదాలు తొలగిపోతాయి. ఆనందంగా ఉంటారు. మేధావులను కలుస్తారు. ఈ రోజు మీరు ఒత్తిడి లేకుండా ఉంటారు. ఆఫీసు సహోద్యోగుల సహకారం అందుతుంది. 


Also Read: తెలుగు సంవత్సరాల పేర్లకి నారదుడికి లింకేంటి?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి