Rains in Telangana AP: నైరుతి రుతుపవనాల ప్రభావంతో సీజన్‌లో చివరిసారి వర్షాలు కురుస్తున్నాయి. నేటి నుంచి తెలుగు రాష్ట్రాల పై అల్పపీడనం ప్రభావం అధికంగా ఉంటుంది. ఏపీ, తెలంగాణలో సోమవారం పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలో వేర్వేరుగా రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. రెండో ఆవర్తనం నేడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనంలో విలీనం అవుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రెండు ఆవర్తనాల ప్రభావంతో రెండు  రోజులపాటు ఏపీ, తెలంగాణలకు మోస్తరు వర్ష సూచన ఉంది. దసరా తరువాత నుంచి రెండు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొట్టనున్నాయి. 
 
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అక్టోబర్ 6 నుంచి 8 వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. సోమవారం సైతం పలు జిల్లాల్లో మోస్తరు  వర్షాలు కురిశాయి. ఉత్తరాధి జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. 
రెండు రోజుల తరువాత కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో అక్కడ్కడా భారీ వర్షాలు కురిసే అవకా: ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందటంతో ఈ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో వార్నింగ్ జారీ చేసింది.  గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచననున్నాయి. హైదరాబాద్ ను మేఘాలు కమ్మేశాయి. రంగారెడ్డి జిల్లాతో పాటు జీహెచ్ఎంసీ, హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన ఉంది. వర్షం పడకపోతే మధ్యాహ్నానికి ఉక్కపోత అధికమై నగరవాసులు ఇబ్బంది పడతారు. 
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఈ ప్రాంతాల్లో మరో 2 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నగరం, అల్లూరిసీతామరాజు (అరకు వ్యాలీ, పాడేరు), పార్వతీపురం మణ్యం, అనకాపల్లి జిల్లాల్లో భారీగా వర్షాలు పడతాయి. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి. కాకినాడ, కొనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మాత్రం సాయంత్రం అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. 
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో దసరా వరకు సాధారణ వర్షపాతం నమోదు కానుంది. అక్టోబర్ 6 తరువాత గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాలో ఒకట్రెండు చోట్ల నేడు వర్షాలు కురవనున్నాయి. అక్టోబర్ 4 నుంచి తెలుగు రాష్ట్రాల పై అల్పపీడనం ప్రభావం ఉంటుంది. రాయలసీమ జిల్లాలైన కడప​, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 


వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.