Nizamabad News : పండగ పూట ఆ కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. దసరా సెలవుల్లో సరదా ఆడుకుంటుంటే కోతులకు భయపడి చిన్నారులు ప్రాణం మీదికి తెచ్చుకున్నారు. సరదాగా నలుగురు స్నేహితులు ఆడుకుంటుండగా ఒక్కసారిగా కోతుల గుంపు రావటంతో భయపడిన చిన్నారులు పరుగులు తీశారు. వారిని కోతులు వెంబడించాయి.  


కోతులు వెంటబడడంతో 


నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడి పల్లిలో నలుగురు చిన్నారుల విషాదం తీవ్రoగా కలిచివేసింది. గ్రామంలో పండగ పూట విషాద ఛాయలు అలుముకున్నాయి. సరదాగా ఆడుకుంటుండగా కోతులు రావటంతో చిన్నారులు భయపడ్డారు.  కోతుల భయంతో నలుగురు పరుగులు తీశారు. ఊరు చివరన ఉన్న చెరువులో నలుగురు చిన్నారులు దుకేశారు. నలుగురిలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. గమనించిన గ్రామస్తులు ఇద్దరిని కాపాడారు. మరో ఇద్దరిని కాపాడే సమయానికి అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.


చిలకలూరిపేటలో విషాదం 


గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో విషాదం చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని ఓగేరు వాగులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.  చిలకలూరిపేట పట్టణంలోని బొబ్బాల సత్యనారాయణ వీధికి చెందిన రమేష్ , స్రవంతిల కుమారుడు నూతలపాటి కార్తీక్ (14),  దాసరి బజారుకు చెందిన బాజిబాబు కుమారుడు పి. మోహనసాయి అనీష్(13)లు స్నేహితులు. నూతలపాటి కార్తీక్ స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. మోహన సాయి అనీష్(13)  మరో ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి  చదువుతున్నారు. వీరు సోమవారం క్రికెట్ ఆడుకోడానికి బయటకువెళ్లారు. అనంతరం అక్కడకు సమీపంలోని ఓగేరువాగులో ఈతకు దిగారు. పట్టుతప్పి వాగులో కొట్టుకుపోతుండగా విద్యార్థుల కేకలు విన్న స్థానికులు అక్కడకు చేరుకొని వాగులో నుంచి వారిని బయటకు తీసుకువచ్చారు. వారిద్దరనీ పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు అప్పటికే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం వారిని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 


మూడు నెలలైనా దొరకని బ్యాంకు దొంగల జాడ, 8 కేజీల బంగారం తిరిగివ్వాలని బాధితులు ధర్నా  


ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి 


వరంగల్‌ జిల్లాలోని ఉర్సుగుట్ట దగ్గర విషాదం జరిగింది. చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చిన్నారుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని  చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.  


Also Read : Crime News : రియల్ ఆవేశం స్టార్ - పోలీసులు ఆపారని బైక్ కాల్చేసుకున్నాడు.. కేసుల పాలయ్యాడు !


Also Read : 70 ఏళ్లు దాటిన వృద్ధుడ్ని ఇలా కూడా చంపేస్తారా ? విశాఖలో ఇక రోడ్డెక్కితే గ్యారంటీ ఉండదు !