Nizamabad News : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. భారీగా నగదు, 8 కేజీల బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారు. చోరీ జరిగి మూడు నెలలు గడుస్తున్నా, నిందితులను పట్టుకోవటంలో పోలీసులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇంత వరకు దొంగల జాడ దొరకలేదు. బ్యాంకులో బంగారం కొదువ పెట్టుకున్న బాధితులు మాత్రం లబోదిబోమంటున్నారు. తమ బంగారం తమకు ఇచ్చేయాలంటూ బ్యాoక్ ఎదుట బాధితులు సోమవారం ధర్నాకు దిగారు. 



చోరీ జరిగి 3 నెలలు గడిచినా దొరకని దొంగలు 


మూడు నెలల క్రితం జరిగిన బ్యాంక్ దోపిడీలో బంగారం తాకట్టు పెట్టి ఆర్థిక రుణం తీసుకున్న వారు ప్రస్తుతం ఆందోళనకు గురవుతున్నారు. బంగారం కోల్పోయిన బాధితులు సోమవారం ధర్నాకు దిగారు. బుస్సాపూర్ గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో మూడు నెలల క్రితం దొంగతనం జరిగింది. బ్యాంకులో తాకట్టు పెట్టిన 8 కేజీల బంగారం, నగదును తమకు తిరిగి ఇచ్చేయాలంటూ బ్యాంక్ ఎదుట ధర్నాకు దిగారు బాధితులు. పోలీసులు వచ్చి నచ్చచెప్పినా బాధితులు ధర్నా కొనసాగించారు. చివరకు బ్యాంక్ రీజినల్ మేనేజర్ మహివివేక్ బ్యాoకు వద్దకు చేరుకొని బాధితులను సముదాయించే ప్రయత్నం చేశారు. కస్టమర్లు తాకట్టు పెట్టి ఆర్థిక రుణం తీసుకున్న సమయం నుంచి బ్యాంకు దోపిడీ జరిగిన తేదీ వరకు వడ్డీ తీసుకొని గోల్డ్ స్మిత్ వ్యాపారి బ్యాంకులో ధృవీకరించిన ప్రకారం తాకట్టులో ఉన్న ఒక్క తులం బంగారు ఆభరణానికి ఒక్క గ్రాము చొప్పున తరుగు తీసేసి మిగతా బంగారం ఇవ్వటానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సంస్థ  సిద్ధంగా ఉందని  తెలిపారు. బాధితులు వినకుండా తాము ఎంత బంగారాన్ని తాకట్టు పెట్టామో అంతే బంగారాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.



 
నిందితులను పట్టుకోవాలని బాధితుల డిమాండ్ 


అసలు పోలీస్ శాఖ ఏం చేస్తోందని బాధితులు ఆవేదనకు వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలు గడిచినా పోలీసులు ఇంకా దొంగలను ట్రేస్ చేయకపోవటంపై ఆరోపణలు వెళ్లివెత్తున్నాయి.  భారీ స్థాయిలో  బంగారం, నగదు బ్యాoకు నుంచి ఎత్తుకెళ్లిన దుండగులను ఇప్పటి వరకు గుర్తించలేకపోవటoపై అనేక అనుమానాలు వస్తున్నాయి అంటున్నారు బాధితులు. త్వరగా చోరీ చేసిన నిందితులను పోలీసులు పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 


మా బంగారం మాకు ఇచ్చేయండి


"బ్యాంకులో బంగారం పెట్టి రుణం తీసుకున్నాను. జులై 4న బ్యాంకులో దొంగలు పడి బంగారం చోరీ చేశారు. అయితే బ్యాంకు అధికారులతో మేం ఎంత రుణం తీసుకున్నామో అంతా తిరిగి ఇచ్చేస్తామని చెప్పాం. మా గోల్డ్ మాకు ఇచ్చేయాలని కోరుతున్నాం. అయితే బ్యాంకు అధికారులు తరుగు తీసేసి మిగిలిన బంగారానికి డబ్బులు కట్టి ఇస్తామని చెబుతున్నారు. మేము కచ్చితంగా ఎంత బంగారం పెట్టామో అంతా ఇవ్వాలని కోరుతున్నాం. మీ నగదు చెల్లిస్తామని అధికారులు చెప్పాం. మూడున్నర నెలలు అవుతున్నా ఇంకా దొంగల్ని పట్టుకోలేదు."- బాధితుడు 


Also Read : Vizag Crime News : 70 ఏళ్లు దాటిన వృద్ధుడ్ని ఇలా కూడా చంపేస్తారా ? విశాఖలో ఇక రోడ్డెక్కితే గ్యారంటీ ఉండదు !


Also Read : Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు