Telangana Ice Apple: the prices of Thati Munjalu heating up: ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. ఉష్ణ తాపానికి ప్రజలు శీతల పానీయాలు అధికంగా తీసుకుంటారు. ముఖ్యంగా కొబ్బరి బొండాలు, తాటి ముంజలు వేడిని బాగా తగ్గిస్తాయి. తాటి ముంజలు బాడీలో ఉష్ణాన్ని తగ్గించటంతో పాటు ఆరోగ్యానికి చాలా మేలుచేస్తుందంటున్నారు. బాడీలో వేడిని తగ్గించటంతో పాటు కిడ్నీలను శుద్ధి చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి మెదడును బాగా ఉత్తేజ పరుస్తుందని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు. కేవలం వేసవిలోనే దొరికే తాటి ముంజలకు బాగా డిమాండ్ ఉంటుంది. కొబ్బరి గుజ్జులాగా ఉండే ముంజలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి తాటి చెట్టుకు కాస్తాయి. వేసవిలో తాటి ముంజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వేసవిలో చాలా మంది తాటి ముంజలను తినేందుకు ఇష్టపడతారు.
కిలో తాటి ముంజలు రూ. 500
వేసవిలో ఉష్ణతాపాన్ని తగించేందుకు తాటి ముంజలు బాగా పనిచేస్తాయి. అందుకే వీటి ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే తాటి చెట్ల నుంచి వీటిని సేకరిస్తారు. ఈ సారి వీటి ధర బాగా పెరిగిపోయింది. ఈ వేసవిలో ఊళ్ళ నుంచి నగరాలు, పట్టణాలకు తీసుకొచ్చి తాటి ముంజలను విక్రయిస్తారు. గతంలో లాగా ముంజలు కోసి వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఎత్తుగా ఉండే తాటి చెట్లను ఎక్కే వారు కరువయ్యారు. దీంతో ముంజల ధరలు (Price Of Thati Munjalu) బాగా పెరిగిపోయాయి. కేజీ ముంజలు ఇప్పుడు రూ. 500 పైనే విక్రయిస్తున్నారు. ఇవి ముఖ్యoగా.... గ్రామీణ ప్రాంతాల్లోనే దొరుకుతాయి. అదీ వేసవిలో మాత్రమే కాస్తాయి. దీంతో వీటి ధరలు బాగా పెరిగిపోయాయని చెట్టు ఎక్కి కోసిన వారికి రూ 500 నుంచి వెయ్యి రూపాయల దాకా చెల్లించాల్సి వస్తోంది.
ఊళ్ళ నుంచి సేకరించి నగరాలకు పట్టణాలకు తీసుకుని విక్రయించాలంటే ఖర్చు కూడా బాగా పెరిగిపోయిందని అంటున్నారు. తాటి ముంజలు అమ్మేవారు. గతేడాది కేజీ తాటి ముంజలు రూ.250 నుంచి 300 ధర ఉండేది. ఈ సారి ఏకంగా కేజీ ముంజల ధర రూ. 500లకు పెంచేశారు. ఆరోగ్యానికి మేలు చేసే ముంజలు తిందామన్న వారికి వాటి ధర తినకుండా చేస్తోందంటున్నారు ప్రజలు. వానలు ఏప్రిల్, మే నెలలో మాత్రమే ఈ తాటి ముంజలు అందుబాటులో ఉంటాయి.
తాటి చెట్టులాగా పెరిగిపోతున్న ధరలు..
ఉత్తర తెలంగాణలో ఈ తాటి ముంజలు ఎక్కువగా దొరుకుతాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, ఉమ్మడి కరింనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ తాటి ముంజలు ఎక్కువగా లభిస్తాయి. ఈ ప్రాంతాల్లో తాటి చెట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇక్కడి ప్రజలు శరీరం చల్లదనానికి తాటి ముంజలు ఎక్కువగా తీసుకుంటారు. తాటి ముంజలు గుజ్జులుగా తెల్లగా ఉంటాయి. ముంజలు మధ్య భాగంలో కొబ్బరి నీరు వంటి ద్రావకం ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే వీటి ధరలు కూడా తాటి చెట్టులాగా పెరిగిపోతున్నాయంటున్నారు ప్రజలు.