Tiger Attack In Komaram Bheem Asifabad District News: కుమ్రంభీం ఆసిఫాబాద్‌లోజిల్లాలో పెద్దపులి వణికిస్తోంది. ఓ యువతిపై దాడి చేసి 24 గంటలు గడిచిందో లేదో మరో రైతుపై పులిదాడి చేసి గాయపరిచింది.సిర్పూర్ (టి)మండలంలోని దుబ్బగూడ గ్రామానికి చెందిన రైతుపై పులి దాడి చేసింది. ఈ ఘటన జరిగింది. పొలంలో సురేష్ అనే రైతు పని చేస్తుండగా పెద్దపులి దాడి చేసింది. పక్కనే ఉన్న వారంతా గట్టిగా కేకలు వేసి అరవడంతో పులి భయపడి పారిపోయింది. రక్తపు మడుగులో పడి ఉన్న సురేష్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆయనకు సిర్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి పంజా విసురుతోంది. ఒక్కరోజు వ్యవధిలోనే ఇద్దరిపై అటాక్ చేసింది. ఇందులో ఒకరు చనిపోగా మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలో నజ్రుల్ నగర్ విలేజ్ పరిదిలో శుక్రవారం పులి పంజా దెబ్బకు గన్నారం గ్రామానికి చెంది 21 ఏళ్ల మోర్లె లక్ష్మి మృత్యువాత పడ్డారు. పొలంలో పత్తి ఏరుతుండగా పులి వచ్చి దాడి చేసింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో పులి దాడి చేసింది. పులి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా చనిపోయింది.
ఈ భయంలో జనం ఉండగానే మరోసారి పులి తన విశ్వరూపం ప్రదర్శించింది. ఇవాళ ఉదయం పది గంట ప్రాంతంలో సురేష్ అనే రైతుపై పులి దాడి చేసింది. ఈయన కూడా పొలంలో పని చేస్తుండగానే పులి ఎటాక్ చేసింది. ఆయన గట్టిగా కేకలు వేయడంతో మిగతా వాళ్లు అలర్ట్ అయ్యి గట్టిగా కేకలు వేశారు. దీంతో పులి ఆయన్ని విడిచిపెట్టి అడవిలోకి పారిపోయింది. ఈ విషయాన్ని అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు సురేష్‌ను ఆసుపత్రికి తరలించారు.
శుక్రవారం పులి పంజాకు బలైన లక్ష్మీకి ఏడాది క్రితమే వివాహం అయింది. సురేష్‌కి కూడా ఫ్యామిలీ ఉంది. ఇలా ఒక్కరోజు వ్యవధిలోనే పులి దాడి చేయడంతో ప్రజలు బెదిరిపోతున్నారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే పత్తి ఏరడానికి ఇదే మంచి సమయమని ఇప్పుడు కూడా సరిగా పొలం పనులు చేయలేకపోతున్నామని కూలీలు కూడా దొరకడం లేదని అంటున్నారు. దొరికే పరిస్థితి ఉన్న ప్రాంతాల్లో పులి భయంతో పని చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అంటున్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకొని పులి బారి నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు.
లక్ష్మీ మృతదేహంలో కాగజ్‌నగర్ అటవీశాఖ కార్యాలయం వద్ద స్థానికులు ఆందోళన చేయడం కొన్ని డిమాండ్లకు అధికారులు అంగీకరించారు. కానీ పులి తరిమేసేందుకు ఏంచేయబోతున్నారో చెప్పలేదు. ప్రజలే జాగ్రత్తగా ఉండాలంటూ ఆదేశిస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికే కాగజ్‌నగర్‌లో 144 సెక్షన్ పెట్టిన అధికారులు అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని చెబుతున్నారు.
మహారాష్ట్ర అడవుల నుంచి వస్తున్న పెద్ద పులులు నాలుగేళ్లుగా నలుగురిని బలి తీసుకున్నాయి. ఇలా పులి దాడిలో చనిపోయిన వారంతా కూలీలు, చిన్న రైతులే. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పులి సంచారంతో వణికిపోతున్న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు- కాగజ్‌నగర్ మండలంలో 144 సెక్షన్