144 section In Kagaznagar Today: పత్తి ఏరుతుండగా యువతి పులి దాడి చేసి చంపేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో జరిగిన ఈ దారుణం జిల్లా ప్రజలను భయపెడుతోంది. ఎటు నుంచి క్రూరమృగం దాడి చేస్తుందో అని మండల ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. యువతి మోర్లె లక్ష్మీ మృతితో అటవీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మండలం మొత్తం 144 సెక్షన్ విధించారు. కొన్ని గ్రామాల్లో ప్రజలు ఎవరూ బయటకు రావద్దని అధికారులు సూచనలు చేస్తున్నారు. 

కొన్ని రోజులుగా ఉమ్మది ఆదిలాబాద్ జిల్లాలో పులులు స్వైర విహారం చేస్తున్నాయి. పశువుల మందలపై దాడులు చేస్తూ వచ్చాయి. ఆఖరికి శుక్రవారం ఉదయం పత్తి ఏరుతున్న మోర్లె లక్ష్మి అనే యువతిపై దాడి చేసి చంపేసింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆమె మృతి చెందినద్దు వైద్యులు తేల్చి చెప్పారు. 

మరోసారి ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. కాగజ్‌నగర్‌ మండలంలో ఆంక్షలు విధించారు. దాదాపు పది, పదిహేను గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. గన్నారం, ఈజ్గామ్, ఆరెగూడ, నజ్రూల్ నగర్, బాబూనగర్, అనుకోడా, సీతానగర్, కడంబా, చింతగూడ ప్రజలు బయటకు రావద్దని సూచించారు. అత్యవసరమైతే తప్ప  రోడ్లపైకి రావద్దని అంటున్నారు. 

Also Read: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం

రక్తపు రుచి మరిగిన పులి దాడి చేసిన ప్రాంతానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అందుకే ఆ ప్రాంతానికి అసలు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. పులి దాడి చేసిన ప్రాంతం పరిధిలో అలర్ట్ పెట్టారు. నాలుగేళ్లకుగా ఇక్కడ పలుల సంచారం విపరీతంగా పెరిగిపోయింది. అందుకే ఆ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిత్యం అధికారులు సూచన చేస్తూనే ఉన్నారు. నాలుగేళ్లుగా నలుగురిని ఈ క్రూరమృగం పొట్టన పెట్టుకుంది. ఏడాదికొకర్ని ఇలా చంపేస్తోంది. అందుకే ప్రజలు పంట చేళ్లకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. ఇలా పులి బారిన పడి చనిపోయిన వారంతా పొలం పనుల కోసం వెళ్లిన వాళ్లే. పశువుల అయితే వందల సంఖ్యలో చనిపోయి ఉంటాయని అంటున్నారు స్థానికులు. 

Also Read: కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు