ఈ యువకుని పేరు భాను ప్రసాద్. ఇతని వయస్సు 20 ఏళ్లు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ధర్మారావు పేట ఇతని గ్రామం. తల్లిదండ్రులు రమణా భాయి, సంగారావు. భాను ప్రసాద్ కు ఓ సోదరి ఉన్నారు. వీరిది చిన్న కుటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. పుట్టుకతోనే భాను ప్రసాద్ రెండు చేతులు పనిచేయవు. అతని వైకల్యం చూసి తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోయారు. కుమారుడి చేతులు బాగు చేసేందుకు తిరగని ఆస్పత్రి లేదు. మొక్కని దేవుడు లేడు. చేతులు పనిచేసేందుకు వారు ఎంతో ఖర్చు చేశారు. ఉన్న ఒక ఎకరం భూమిని కూడా అమ్మేసి వైద్యం కోసం వెచ్చించారు. అయినా ఫలితం దక్కలేదు. భూమి కోల్పోయి తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ కూలీలుగా మారారు. కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.


ఏ పనిచేయాలన్నా చేతులు ఎంతో అవసరం. కానీ భాను ప్రసాద్ కు రెండు చేతులు పనిచేయవు. కానీ భాను ప్రసాద్ మాత్రం అధైర్య పడలేదు. చిన్ననాటి నుంచి చదువుపై ఎంతో ఆసక్తి చూపేవాడు. స్కూల్ కి వెళ్లేవాడు కాదు. కానీ ఆ గ్రామంలో మధు అనే ఉపాధ్యాయురాలి వద్దకు ట్యూషన్ వెళ్లవాడు. చదువుపై భాను ప్రసాద్ కు ఉన్న ఆసక్తిని గమనించిన టీచర్ మధు చేతులు లేకున్నా పర్వాలేదు. కాళ్లతో అతనితో ఓనమాలు దిద్దించారు. ఎంతో ఆసక్తిగా ప్రయత్నం చేశాడు. ముత్యాల్లాంటి అక్షరాలను కాళ్లతోనే రాసి అందరినీ ఆశ్చర్యపరిచేవాడు. తర్వాత ప్రభుత్వ స్కూల్ లో జాయిన్ అయి భాను ప్రసాద్ చదువుపై ఆసక్తి చూపాడు. ఇటీవల డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి, రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదరు చూస్తున్నాడు.


అయితే భాను ప్రసాద్ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ ఇద్దరి పిల్లలను చదివిస్తున్నారు. భాను ప్రసాద్ కు చిన్నప్పటి నుంచి ఎంతో ఖర్చు చేశాం. ఉన్నదంతా భాను వైద్యం కోసం వెచ్చించామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భాను సపర్యలన్నీ అమ్మే చేస్తుంటారు. స్కూల్ కి వెళ్లిన సమయంలో కూడా తల్లే అతని వేంట ఉండేవారు. ఇంటర్మీడియట్, డిగ్రీలో కాలేజీ  సమయంలో భాను ప్రసాద్ స్నేహితులు సాయం తీసుకున్నాడు. అక్షరాలు దిద్దడమే కాదు.. అన్నం సైతం కాలితోనే తింటాడు. అతని పరిస్థితిని చూసి తల్లిదండ్రులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.


‘చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు నా కోసం ఎంతో కష్టపడ్డారు. నా కోసం నా తల్లి పడుతున్న శ్రమ ఆవేదనకు గురిచేస్తోంది. భాను ప్రసాద్ బీకాం పూర్తి చేశా.  నా కోసం ఎంతో శ్రమించిన తల్లిదండ్రుల కోసం నా వంతు బాధ్యత నిర్వహించాలన్న తపన ఉంది. డిగ్రీ పూర్తి అయ్యిందని తన పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వం ఏదైనా ఉద్యోగం ఇస్తే కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటుందని’ భాను ప్రసాద్ కోరుతున్నాడు.


సంకల్పం  ఉంటే దేన్నైనా సాధించని భాను ప్రసాద్ నిరూపిస్తున్నాడు. రెండు చేతులూ లేకున్నా... అధైర్యపడకుండా ముందడుగు వేస్తూ చదువుపై ఆసక్తి చూపాడు. అతడి సంకల్పమే డిగ్రీ పూర్తి చేయించింది. తమ కాళ్లమీదే నిలబడాలి అనుకునే వారికి కాళ్లనే చేతులుగా మార్చుకుని అక్షరాలు దిద్దిన భాను ప్రసాద్ అందరికీ ఆదర్శంగా మారాలని ఆకాంక్షిద్దాం.. మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెబుదాం..


Read Also: ఉల్లి, అన్నం, బ్రెడ్, మొక్కజొన్న... ఇలాంటివి మాడినా కూడా తింటున్నారా? క్యాన్సర్ రావచ్చు జాగ్రత్త


Also Read: Weather Updates: తెలంగాణలో 11 జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌.. చలి గాలులకు వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు


Also Read: Biryani: మనోళ్లు మాములుగా తినలేదుగా... నిమిషానికి ఎన్ని బిర్యానీలు కుమ్మేశారో తెలిస్తే షాకవుతారు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి