Minister Indrakaran Reddy: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 30వ తేదీన సీఎం కేసీఆర్ పర్యటించబోతున్నారని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని, సీఎం పాల్గొనే బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని సూచించారు. సీఎం పర్యటన సందర్భంగా సోమ‌వారం జిల్లా కేంద్రంలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ ముఖ్య కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు. స‌భా స్థ‌లం, ఏర్పాట్ల‌పై చ‌ర్చించారు.


ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ.... బీఆర్ఎస్ శ్రేణులు సమన్వయంతో ప‌ని చేసి సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌నను విజయవంతం చేయాలన్నారు. భారీ బహిరంగ సభకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేలా చూడాలని నాయకులకు సూచించారు. ఎక్క‌డ ఎలాంటి లోటుపాట్లు తలెత్త‌కుండా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని వివరించారు. సమీకృత జిల్లా కార్యాల‌యాల స‌ముదాయం, జిల్లా పోలీస్‌ కార్యాలయంతో పాటు బీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీయం కేసీఆర్ ప్రారంభించనున్నారు. లాంఛ‌నంగా పోడు ప‌ట్టాలను ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారని, అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారన్నారు.






పోడు భూముల పట్టాల పంపిణీ - 


ఈ నెల 30వ తేదీ నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి జూన్ 30న సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి జిల్లాలు, నియోజకవర్గాల్లో అదే రోజు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్నారు. కాగా ఈ నెల 24 నుంచే పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రకటించినప్పటికీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈనెల 30వ తేదికి మార్చవలసి వచ్చింది. జాతీయ ఎన్నికల కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుండడం, అందుకు సంబంధించి నిన్న, ఇవ్వాల జిల్లా కలెక్టర్లకు శిక్షణా తరగుతులు నిర్వహస్తుండడం, ఈ నెల 29న బక్రీద్ పండుగ వుండడం వంటి కారణాలరీత్యా ప్రకటించిన కార్యక్రమాన్ని జూన్ 30వ తేదీకి వాయిదా వేశారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈనెల 30వ తేదీన కేవలం పోడు భూముల పట్టాలను పంపిణీ చేయడమే కాకుండా నూతన కలెక్టరేట్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించబోతున్నారు.