Rythu Bandhu Funds Released: తెలంగాణలో రైతు బంధు సంబురం మొదలైంది. పంట పెట్టుబడి రాయితీ సాయం పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రారంభించింది. రైతు బంధు పథకం కింద నేడు తొలిరోజు రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో రూ.642.52 కోట్లు జమ అయ్యాయి. ఎకరాలను బట్టి ప్రతి రోజు కొందరు రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. నేడు 22,55,081 (22 లక్షల 55 వేల 81) మంది రైతులకు పెట్టుబడి సాయం వారి ఖాతాల్లో జమ చేశారు.


నేడు 22,55,081 (22 లక్షల 55 వేల 81) మంది రైతులకు పెట్టుబడి సాయం వారి ఖాతాల్లో జమ చేశారు. వ్యవసాయ శాఖ ద్వారా అందుతున్న సూచనలు పాటించాలని అన్నదాతలకు మంత్రి సూచించారు. ఇదివరకే రైతు బంధు నిధులు విడుదలపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయశాఖ, ఆర్థిక శాఖ అధికారులు సమన్వయంతో రైతు బంధు నగదు ఖాతాల్లో జమ చేయాలన్న ఆదేశాలను నేటి నుంచి అమలుచేస్తున్నారు. రైతు బంధులు నిధులు విడుదల చేసి, రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడంపై సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావుకు మంత్రి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
Also Read: మండుతున్న టమాటా ధరలు, త్వరలో రూ.100 మార్క్ దాటడం కన్ఫామ్! కారణం ఏంటంటే






రైతు బంధు పండుగ మొదలైంది..
రైతుల ఖాతాల్లో వానా కాలం పెట్టుబడి రైతు బంధు నగదు జమ మొదలైంది. దీనిపై స్పందిస్తూ ఆర్ధికశాఖ మంత్రి హరీశ్​రావు హర్షం వ్యక్తం చేశారు. మరోమారు రైతుబంధు పండగ ప్రారంభమైందని ట్వీట్ చేశారు. లక్షల మంది రైతులు ఇవాళ్టి నుంచి రైతుబంధు ద్వారా పంట పెట్టుబడి సాయం అందుతుందన్నారు. సీఎం కేసీఆర్ రైతుల శ్రేయస్సును ఆకాంక్షించి రైతు బంధు అందిస్తున్నారని తొలిరోజు రూ.645.52 కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమ అయిందన్నారు. ఎకరా సాగుభూమి ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ అయిందని ట్వీట్ లో పేర్కొన్నారు. 


ఈ సారి 1.5లక్షల మంది పోడు రైతులకు సైతం రైతుబంధు అందించాలని కేసీఆర్ నిర్ణయించారు.  కొత్తగా 5 లక్షల లబ్దిదారులు రైతు బంధు సాయం అందుకోనున్నారు. 1.54కోట్ల ఎకరాలకుగానూ అర్హులైన రైతుల ఖాతాల్లో మొత్తం రూ.7720.29కోట్లు జమకానున్నాయి.  సుమారు 4 లక్షల పోడు భూములకు రైతు బంధు లభించనుంది. 10 వ విడత వరకు రూ.65,190 కోట్లు జమ చేశారు. గతం కన్నా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.300 కోట్ల అదనపు భారం పడనుంది.  11వ విడత పూర్తయ్యేసరికి అర్హులైన రైతలన్నలకు పంట నగదు సాయం అందుతుందని మంత్రి తెలిపారు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial