డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం దూర విద్యా విధానంలో బీఈడీ, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


జూన్ 6న బీఈడీ ఓడీఎల్ ప్రవేశ పరీక్షను ఉదయం 10.30గంటల నుంచి 12.30గంటల వరకు; అలాగే, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) ప్రవేశ పరీక్ష అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదుచేసి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


BRAOU BEd.(ODL)-2023 Results


BRAOU BEd.(SE)-2023 Results


పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష పేపరును రెండు భాగాలుగా(పార్ట్-ఎ, పార్ట్-బి) విభజిస్తారు. వీటిలో పార్ట్-ఎ: జనరల్ ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ 40 మార్కులు, పార్ట్-బి: జనరల్ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ & అనలిటికల్ రీజనింగ్ (వెర్బల్ & అబ్‌స్ట్రాక్ట్ రీజనింగ్) 60 మార్కులు ఉంటాయి. 


నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


డిగ్రీ ఫీజులను ఖరారు చేయని ప్రభుత్వం, ప్రవేశాల గడువు పొడిగింపు!
ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఫీజులు ఖరారు చేయకపోవడంతో.. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల గడువును ఉన్నత విద్యా మండలి పొడిగించింది. శుక్రవారంతో ఈ ప్రవేశాల గడువు ముగియగా, తాజాగా జులై 5 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. జూన్ 26 నుంచి 30 వరకు జరగాల్సిన వెబ్ ఐచ్ఛికాలను జులై 7 నుంచి 12కి మార్చారు. జులై 3న ఉండాల్సిన సీట్ల కేటాయింపుని జులై 16కి మార్పు చేశారు. జులై 4న మొదలు కావాల్సిన కళాశాలలను జులై 17కి వాయిదా వేశారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం, ఫీజు చెల్లింపు గడువు ఇదే! పూర్తి షెడ్యూలు ఇలా!
తెలంగాణలో ఎంసెట్-2023 ప్రవేశాల కౌన్సెలింగ్ సోమవారం (జూన్ 26) ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 26 నుంచి జులై 5 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థులకు జూన్ 28 నుంచి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఇది పూర్తయినవారు అభ్యర్థులు 28 నుంచి జులై 8 వరకు కళాశాలల్లో సీట్ల ఎంపికపై ఐచ్ఛికాలను (వెబ్ ఆప్షన్లు) నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ, చివరితేదీ ఎప్పుడంటే?
బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్, బీఎఫ్‌ఏ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్ కోర్సుల్లో చేరేందుకు 'OAMDC' రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19న ప్రారంభమైంది. జూన్ 24 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో ఓసీ అభ్యర్థులు రూ.400, బీసీలు రూ.300, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులైతే రూ.200 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ పాసైన విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. 
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..