Kumram Bheem Asifabad Latest News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని దిందా గ్రామ రైతులను శామీర్‌పేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని సొంత ప్రాంతాలకు తరలించారు. ఈ క్రమంలో అరెస్టు చేసిన ప్రాంతంలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులకు, పోలీసులకు మధ్యతోపులాట చోటు చేసుకుంది. ఈ పెనుగులాటలో కొందరు రైతులు గాయపడ్డారు.
దిందా గ్రామ రైతులు పోడు భూముల కోసం చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు. స్థానికంగా చేస్తున్న ధర్నాలపై ప్రభుత్వాన్ని కదలించడం లేదని గ్రహంచిన రైతులు నేరుగా సీఎంను కలిసి తమ గోడు వెల్లబోసుకునేందుకు బయల్దేరారు. వస్తున్న క్రమంలో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కష్టాలు చెప్పుకోవాలని దిందా గ్రామ రైతులు ఈ నెల 7న బయల్దేరారు. 400కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌కు పాదయాత్రగా వెళ్లి సమస్యలను సీఎంకు వివరించాలని భావించారు. వారి పాదయ్తర 13వ తేదీ నాటికి గజ్వేల్ నియోజకవర్గానికి చేరుకుంది. వారికి బీఆర్‌స్ ప్రధాన కార్యదర్సి ఆర్‌ఎస్‌ప్రవీణ్ కుమార్ మద్దతు తెలిపారు. వాితోపాటు పాదయాత్ర చేపట్టారు. పోడు వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దిందా పోడు రైతులు సాగు చేసుకుంటున్న భూములను జీవో 49 తెచ్చి అటవీ అధికారులు దౌర్జన్యంగా జెసిబిలతో భూముల్లో గుంతలు తవ్వడం, వారి భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.
దిందా పేద రైతులపై సీఎం రేవంత్ రెడ్డి శ్రద్ధ పెట్టాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఈ పేద రైతులంటే ఎందుకు ఇంత కోపమని, మహారాష్ట్ర సరిహద్దున దిందా నుంచి హైదరాబాద్ వరకు 400 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణం అన్నారు.
అలా బయల్దేరిన రైతుల పాదయాత్ర నేడు గురువారం ఉదయం షామీర్‌పేట్ వరకు చేరుకుంది. షామీర్‌పేట్ దగ్గర పోలీసులు వారిని అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. పాదయాత్ర చేస్తున్న 40 మందిని పోలీసు వాహనంలోకి ఎక్కించి వారిని ఆసిఫాబాద్ వైపు తీసుకెళ్లారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు పెనుగుటాల జరిగింది. కొందరు రైతులు గాయపడ్డారు.
రైతులు ఏబీపీ దేశంతో ఫోన్ ద్వారా సంప్రదించింది. తాము ఉదయం నుంచి టిఫిన్ కూడా చేయలేదని బాత్రూం కూడా వెళ్దాం అన్నా దించకుండా బస్సులోనే బలవంతంగా తీసుకెళ్తున్నారని రైతులు వాపోయారు. ఇది దారుణమని, మరికొద్ది గంటల్లో ప్రజాభవన్‌కు చేరుకొని తమ గోడు సీఎంకు తెలియజేస్తామనుకుంటే పోలీసులు అరెస్టు చేయడం దారుణం అన్నారు. శాంతియుతంగా వస్తున్న తమని పోలీసులు బస్సులో తిరిగి తీసుకెళ్లడం సరికాదన్నారు. తమకు న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని వివిధ రూపాల్లో కొనసాగిస్తామన్నారు.