Telangana Weather Today: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తెలంగాణపై పడింది. ఇవాళ రేపు భారీ వర్షాలుకురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. చాలా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలతో అల్లాడిపోయిన హైదరాబాద్‌కు కాస్త ఊరట లభించింది. రెడ్‌జోన్‌లో హైదరాబాద్ లేదని అధికారులు తేల్చి చెప్పారు. హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు మాత్రమే పడతాయని చెబుతున్నారు.
రెండు రోజుల తెలంగాణ వాతావరణం ఇదే!
13-14 తేదీల్లో రెడ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలు:- మెదక్, సంగారెడ్డి, వికారాబాద్,
13-14 తేదీల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలు:- భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సూర్యపేట,
13-14 తేదీల్లో ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాలు:- ఆదిలాబాద్, హన్మకొండ, హైదరాబాద్, జిగిత్యాల, జనగాం, జోగులాంబ గద్వాల్, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీమ్, ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి,
14-15 తేదీల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలు:- జయశంకర్‌భూపాలల్లి, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు,
14-15 తేదీల్లో ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాలు:-ఆదిలాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, కామారెడ్డి,
వర్షాల కారణంగా విద్యుత్ సరఫరా అంతరాయం
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలు తెలుసుకునేందుకు తెలంగాణ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) వినియోగదారుల కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది.
కంపెనీ 167 ‘ఎలక్ట్రిసిటీ అంబులెన్స్’ మోహరించింది. వీటిలో శిక్షణ పొందిన సిబ్బంది, అవసరమైన పరికరాలు సిద్ధంగా ఉంటాయని పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్‌లో 213 ఫ్యూజ్ కాల్ ఆఫీస్ (FOC) జీపీఎస్ సదుపాయం కలిగిన వాహనాలతో 24 గంటలూ పనిచేస్తున్నాయని తెలిపారు.
ఇంజనీర్లు, సిబ్బంది ప్రధాన కార్యాలయంలో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని, అన్ని సెలవులు రద్దు చేయాలని TGSPDCL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషర్రఫ్ ఫారూకీ ఆదేశించారు. విద్యుత్ ప్యానెల్ల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టి, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
వినియోగదారులు విద్యుత్ సమస్యల కోసం టోల్ ఫ్రీ 1912, స్థానిక ఫ్యూజ్ కాల్ ఆఫీస్ లేదా కింది కంట్రోల్ రూమ్ నంబర్లకు సమాచారం ఇవ్వవచ్చని అధికారులు తెలిపారు.
GHMC సర్కిల్:-
•హైదరాబాద్ సెంట్రల్ – 8712469862
•హైదరాబాద్ సౌత్ – 8712470596
•సికింద్రాబాద్ – 8712470535
•బంజారాహిల్స్ – 8712468948
•సైబర్ సిటీ – 8712469534
•హబ్సీగూడ – 8712471466
•మెడ్చల్ – 8712472559
గ్రామీణ మండలాలు:
•నల్గొండ – 8712469138
•సూర్యాపేట – 8712472773
•మహబూబ్‌నగర్ – 8712472127
•వనపర్తి – 8712471758
•నాగర్‌కర్నూల్ – 8712470915
•మెదక్ – 8712473356
•సంగారెడ్డి – 8712473116
•వికారాబాద్ – 8712469795
TGSPDCL తాజాగా 1912 కాల్ సెంటర్‌ను ఆధునీకరించి, 74 శిక్షణ పొందిన ఆపరేటర్లు ఒకేసారి 400 కాల్స్ స్వీకరించగల సామర్థ్యం కల్పించింది. ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత వినియోగదారులకు ఫిర్యాదు ID ఇస్తారు. .
రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీగా వర్షపాతాలు నమోదు అవుతున్నాయి. జలాశాయాలు ఉప్పొంగుతున్నాయి. చాలా ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు నీళ్లువిడుదల చేస్తున్నారు.మంచిర్యాల జిల్లా లో భారీ వర్షాల కారణంగా వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. సింగూర్ ప్రాజెక్ట్ 11వ గేట్ ఎత్తి 7,694 క్యూసెక్స్ నీటిని దిగువకు వదులుతున్నారు. జెన్కో పవర్ ప్లాంట్ ద్వారా మరొక 1,265 క్యూసెక్స్ నీటి విడుదల చేస్తున్నారు. మొత్తం 8,959 క్యూసెక్స్ నీరుని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్ట్‌లోకి 4,336 క్యూసెక్స్ వరద చేరుతుంది.
మంచిర్యాల జిల్లా నరసాపూర్ గ్రామంలో ఒక గర్భిణీ వరద ప్రవాహంలో ఇరుక్కుపోయింది. తాండూర్ పోలీసులు, ఎస్‌ఎస్‌పీ కిరణ్ కుమార్ నేతృత్వంలో, తాడుతో సహాయం ఆ మహిళను రక్షించారు. ఆమెను సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు.పోలీసుల తక్షణ చర్యకు ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.
పాతబస్తీలోని యాకుత్‌పురా రైల్వే స్టేషన్ దగ్గరలోని వరద కాలువలో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని హైడ్రా సిబ్బంది కాపాడింది. ఆ పరిసరాల్లో పని చేస్తున్న హైడ్రా సిబ్బందికి సమాచారం అందగానే.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. కాలువలోకి దిగడానికి ఏమాత్రం అవకాశం లేని ప్రమాదకర పరిస్థితుల్లో నిచ్చెన కిందకు వేసి యువకుడిని కాపాడింది. మేకల మేత కోసం చెట్టు కొమ్మలను తీసుకువచ్చేందుకు స్థానికంగా నివాసముండే గౌస్(35) ప్రయత్నించాడు. ప్రమాదవసాత్తు వరద కాలువలోకి జారుకున్నాడు. సమాచారం అందుకున్న హైడ్రా ఇన్‌స్పెక్టర్ బాలగోపాల్ హుటాహుటిన సిబ్బందితో అక్కడకు చేరుకుని గౌస్‌ను కాపాడారు.
తెలంగాణలో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. హైదరాబాద్‌లో మూసీనది, ఇతర కాల్వలు పొంగి పొర్లుతున్న సందర్భంలో మరో రెండ్రోజులపాటు భారీ వర్ష సూచన అని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో పరిస్థితిని వివరించారు. సహాయక చర్యలకు సహకరించాల్సిందిగా కోరారు. "నదులు, వాగులు పొంగిపొర్లుతున్నందున.. NDRF (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలను పంపాల్సిందిగా కోరాను. దీనికి అమిత్ షా స్పందిస్తూ.. ఇప్పటికే NDRF బృందాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉంచామని, అవసరమైతే అదనపు బృందాలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు."
మరో రెండ్రోజుల వర్ష సూచన ఉన్నందన తెలంగాణ ప్రజలు అలర్ట్‌గా ఉండాలన్నారు కిషన్ రెడ్డి. "ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. కాబట్టి మూసీ పరివాహక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారుల సూచనల ప్రకారం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి." అని సూచించారు.
బీజేపీ కార్యకర్తలు వరద ప్రాంతాల్లో ప్రజలకు కావాల్సిన సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు తాత్కాలికంగా కావాల్సిన ఆహారం, తాగునీరు, పాలు, అత్యవసర మందులు అందించాలని సూచించారు.