నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకీ కరోనా పంజా విసురుతోంది. కేసులు భారీగా పెరుతున్నాయ్. సోమవారం ఒక్కరోజే 318 కేసులు నమోదయ్యాయ్. ఇది ఆందోళన కలిగిస్తోన్న అంశం. కేసులు పెరుగుతున్నా ప్రజలు కరోనా పై అలసత్వం వహిస్తూనే ఉన్నారు. చాలా మంది మాస్క్ లు ధరించకుండానే భయటికి వెళ్తున్నారు. కేసులు పెరుగుతున్నా సినిమా హాళ్లు నడపటం ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. సోమవారం 1063 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.... 318 మందికి కరోనా పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయ్. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం కేసులు 59,127 పాజిటివ్ కేసులు నమోదయ్యాయ్. ఇందులో ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి కూడా ఉన్నారు.  


నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రికే పేదలు ఎక్కువగా వస్తుంటారు. కోవిడ్ సెక్షన్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. రెండో వేవ్ లో 225 మంది పాజిటివ్ వచ్చిన గర్భిణిలకు  చికిత్సలు చేసి ప్రాణాలు కాపాడారు. రాష్ట్రంలో ఎక్కువ ఐసీయూ పడకలు ఉన్న ఆస్పత్రుల్లో రెండో స్థానంలో ఉంది. రెండో వేవ్ లో చాలా మంది కరోనా పాజిటివ్ రోగులకు వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు. అయితే ప్రస్తుతం వైద్యులు. సిబ్బంది కొరత వేధిస్తోంది. 206 స్ఠాఫ్ నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయ్. ఉన్న వారిలో చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఫార్మాసిస్టులు లేరు. 12 పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయ్. ఏడు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయ్. కోవిడ్ వార్డులో 224 ఐసీయూ బెడ్ లు, 747 ఆక్సిజన్ పడకలు ఉన్నాయ్. ప్రస్తుతం కోవిడ్ పేషేంట్ల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తున్నాయ్. ఇలాంటి సమయంలో వైద్య సిబ్బంది చాలా అవసరం. వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తొంది. ఉన్న సిబ్బందితోనే వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో వారిపై ఒత్తిడి తీవ్రంగా పెరుగుతోంది. అందులోనూ సెకండ్ వేవ్ లో చాలా మంది వైద్య సిబ్బంది కూడా కోవిడ్ కు గురయ్యారు. మహారాష్ట్ర నుంచి సైతం పెద్ద సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ రోగులు ఈ ప్రభుత్వ ఆస్పత్రికి వస్తారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఈ ఆస్పత్రిలో అన్ని వసతులు ఉన్నా... సిబ్బంది కొరత తీవ్రంగావేధిస్తోంది.


ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి వైద్యులు, సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నారు జిల్లా వాసులు. కేసులు రోజు రోజుకీ భారీగా పెరుగుతున్న నేపధ్యంలో ఉన్న సిబ్బందిపై ఒత్తిడి పడకుండా పూర్తి స్థాయిలో ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.


Also Read: రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన... పంట నష్టాన్ని పరిశీలించనున్న సీఎం


Also Read: నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం.... పొలం అమ్మినవాళ్లు ఇబ్బంది పెడుతున్నారని కుటుంబం ఆందోళన


Also Read: టార్గెట్ 2023... వరంగల్ లో దూకుడు పెంచిన బీజేపీ


Also Read:  ఈ సంక్రాంతికి దుమ్ములేపిన చికెన్ సేల్స్.. 60 లక్షల కిలోలు తినేసిన హైదరాబాదీలు, మటన్ సేల్స్ ఎంతంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి