ఇటీవల అకాల వర్షాల కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. పంట నష్టాన్ని పరిశీలించి, రైతులకు భరోసా కల్పించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్  పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు రేపు (మంగళవారం) సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపట్టనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు  సీఎం కేసీఆర్ తో పాటు పర్యటనలో పాల్గొననున్నారు.


Also Read: నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం.... పొలం అమ్మినవాళ్లు ఇబ్బంది పెడుతున్నారని కుటుంబం ఆందోళన


పరకాల నియోజకవర్గంలో 


రేపు వరంగర్ లో జిల్లా  పరకాల నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అకాల వర్షానికి వల్ల జరిగిన పంట నష్టాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. పరకాల నియోజకవర్గంలోని పరకాల మండలం, నడికూడ మండలంలో ఇటీవల వర్షాలకు పంట నష్టం జరిగిందని సీఎం కేసీఆర్ దృష్టికి జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తీసుకెళ్లారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సీఎం కేసీఆర్ ను కలిసి పంటనష్టంపై వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, తానే స్వయంగా పంట నష్టం జరిగిన పొలాలను పరిశీలిస్తానని హామీఇచ్చారు. 


Also Read: టార్గెట్ 2023... వరంగల్ లో దూకుడు పెంచిన బీజేపీ


కోవిడ్ పై కేబినేట్ సమావేశంలో చర్చ


రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులు, వైరస్ వ్యాప్తి నివారణ చర్యలపై కేబినేట్ సమావేశంలో చర్చించారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సోమవారం కేబినెట్‌ సమావేశమైంది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. కరోనా పరిస్థితులు, వైద్యారోగ్యశాఖ సన్నద్ధతపై మంత్రి హరీశ్‌ రావు గణాంకాలతో వివరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉందని మంత్రి వివరించారు. కోవిడ్ వ్యాప్తి పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వైరస్‌ వ్యాప్తి నివారణ కోసం తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలు, ఆంక్షల విషయమై కేబినేట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో విద్యాసంస్థలకు 30వ తేదీ వరకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో విద్యా బోధన విషయమై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.


Also Read:  ఈ సంక్రాంతికి దుమ్ములేపిన చికెన్ సేల్స్.. 60 లక్షల కిలోలు తినేసిన హైదరాబాదీలు, మటన్ సేల్స్ ఎంతంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి