ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగోంది శివారులో దారుణం జరిగింది. పంట పొలాల్లో యువతీ యువకుల రెండు మృతదేహాలు కనిపించడం స్థానికంగా కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
జిల్లాలోని గుడిహత్నూర్ మండలం సితాగోంది గ్రామ శివారులోని ఓ వ్యవసాయ భూమిలో ఓ జంట విగతజీవులుగా కనిపించారు. ఓ యువతి, యువకుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయారని ఆదివారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి సైతం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ఈ మృతులు ఆదిలాబాద్ కు చెందిన రహమాన్, ఓ యువతిగా గుర్తించారు. వీరి మరణానికి వివాహేతర సంబంధమే కారణం కావచ్చని పోలిసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. వివరాల కోసం స్థానికులను ఆరా తీస్తున్నారు.
వీరిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ హత్య ఎవరు చేసుంటారనే కోణంలోను పోలిసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే 3 రోజుల కిందటే వీరు చనిపోయి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. మూడు రోజుల కిందట సీతాగోంది గ్రామంలోని సీసి కెమెరాల్లో ఈ ఇద్దరూ స్కూటీపై వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ ఆద్వర్యంలో స్థానిక ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఇది హత్య అని అనుమానం వ్యక్తం చేశారు. ఉట్నూర్ డిఎస్పి నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ... సంఘటన స్థలంలో డాగ్ స్క్వాడ్, క్లూజ్ టీం ద్వారా సాక్ష్యాలు సేకరించారన్నారు. వీరికి తగిలిన గాయాల వల్ల మరణించి ఉంటారని, అయితే త్వరలో పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
వివాహితపై ముగ్గురు ఆటో డ్రైవర్ల సామూహిక అత్యాచారం!
హన్మకొండ నయీంనగర్ సమీపంలో నివసిస్తున్న ఓ వివాహిత ఏప్రిల్ 2వ తేదీన పని మీద బయటకు వెళ్లి రాత్రి 12 గంటల సమయంలో ఇంటిరి తిరిగి వస్తున్నారు. అర్ధరాత్రి కావడంతో కేయూ క్రాస్ వద్ద రోడ్డుపై వెళ్తున్న ఆటోను ఆపి తనను రంగ్ బార్ వద్ద దింపాలని డ్రైవర్ ను కోరారు. మహిళను ఆటో ఎక్కించుకు్నన డ్రైవర్ రాకేశ్.. తన స్నేహితులైన ఆటో డ్రైవర్లు సనత్, సతీష్ కు ఫోన్ చేయగానే కొద్ది సేపటికే వాళ్లు కూడా వచ్చి ఆటో ఎక్కారు. ఆటోను మహిళ చెప్పిన చోటుకు కాకుండా మరో చోటుకు తీసుకెళ్లడం గమనించిన మహిళ అరవడం ప్రారంభించింది. అయితే అరిస్తే ప్రాణాలు తీస్తామంటూ రాకేశ్ స్నేహితులు బెదిరించారు. దీంతో నోరు మెదపకుండా ఆమె ఆటోలో కూర్చుండగా.. ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.
భీమారం గ్రామ శివారు వద్ద ఎవరూ లేని చోట ఆటో ఆపారు. ఆమెను కిందకు దంపి ఆటో సౌండ్ బాక్స్ శబ్దాన్ని బాగా పెంచారు. అనంతరం ఒకరి తర్వాత మరొకరు సదరు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను రంగ్ బార్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన మహిళ బంధువులకు విషయం తెలపడంతో... హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మహిలళకు వైద్య పరీక్షలు చేయించారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు హన్మకొండ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ జీ తెలిపారు.