తెలంగాణలోని బీసీ గురుకులాల్లో ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఏప్రిల్ 30న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 277 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు మహాత్మా జ్యోతిభా పూలే గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్యబట్టు ఏప్రిల్ 29న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులంతా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని, పరీక్ష నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇంటర్ కోర్సుల ప్రవేశం కోసం 58,113 మంది విద్యార్థులు, డిగ్రీ కోర్సుల కోసం 8,429 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. హాల్ టికెట్‌లో ఉన్న పరీక్షా కేంద్రానికి అరగంట ముందుగా చేరుకోవాలని ఆయన సూచించారు. 6, 7,,8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు 69,147 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. వచ్చే నెల 10న రాష్ట్రవ్యాప్తంగా 299 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామన్నారు. మే నెల 2 నుంచి హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయని చెప్పారు.
Also Read:
TS POLYCET 2023: పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో పాలిసెట్ దరఖాస్తు గడువును పొడిగించారు. రూ.200 ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకునేందుకు మే 14 వరకు గడువు పెంచినట్లు పాలిసెట్ కన్వీనర్ డాక్టర్ శ్రీనాథ్ ఏప్రిల్ 25న ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 ఆలస్య రుసుంతో దరఖాస్తు గడువు ఏప్రిల్ 25తో ముగియగా.. రూ.200 ఆలస్య రుసుముతో మే 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పదోతరగతి పూర్తయిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 17న పాలిసెట్ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.
పాలిసెట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
డీఈఈసెట్-2023 నోటిఫికేషన్ విడుదల, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ!
తెలంగాణలో ప్రాథమిక ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'డీఈఈసెట్-2023' (డీఎడ్) నోటిఫికేషన్ ఏప్రిల్ 21న విడుదలైంది. రెండేళ్ల కాలపరిమతితో ఉండే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 22న ప్రారంభమైంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించి ఏప్రిల్ 22 నుంచి మే 22 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.
ప్రవేశ ప్రకటన, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఫైన్ ఆర్ట్స్, డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు 'ఏడీసెట్-2023' నోటిఫికేషన్ వెల్లడి, వివరాలు ఇలా!
కడపలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ & ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వివిధ ఫైన్ ఆర్ట్స్, డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 'ఆర్ట్ & డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏడీసెట్)-2023' నోటిఫికేషన్‌ను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(బీఎఫ్‌ఏ), బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీడిజైన్ ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏప్రిల్ 21న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాాగా.. మే 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..