నల్గొండ: సూర్యాపేట సమీపంలోని దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర సందర్భంగా ఆదివారం నుంచి హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట వద్ద ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుందని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌ తెలిపారు. ఈ నెల 5న తెల్లవారుజాము నుంచి 9వ తేదీ సాయంత్రం వరకు ఈ ఆంక్షలు ఉంటాయని, వాహనదారులు గమనించాలన్నారు.
హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను సూర్యాపేట సమీపంలోని టేకుమట్ల (మూసీ) బ్రిడ్జి వద్ద జాతీయ రహదారి 65 నుంచి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారి 365 బీబీ మీదుగా మళ్లిస్తారు. రాఘవాపురం స్టేజ్‌, నామవరం, గుంజలూరు స్టేజ్‌ వద్ద తిరిగి 65వ జాతీయ రహదారిపైకి వెళ్లేలా రూట్‌మ్యాప్‌ రూపొందించారు. భారీ, సరకు రవాణా వాహనాలు మాత్రం టేకుమట్ల నుంచి ఖమ్మం జాతీయ రహదారి మీదుగా నాయకన్‌గూడెం నుంచి కోదాడకు వెళ్లేలా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.


విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలు కోదాడ, మునగాల, గుంపుల మీదుగా దురాజ్‌పల్లి సమీపంలోని స్వామి నారాయణ ట్రస్ట్‌ ఎదురుగా ఉన్న ఎస్సారెస్పీ కాల్వ నుంచి బీబీగూడెం, రోళ్లవాగుతండా మీదుగా టేకుమట్ల బ్రిడ్జి మీదకు మళ్లిస్తారు. భారీ, సరకు రవాణా వాహనాలు కోదాడ, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా నార్కట్‌పల్లి వద్ద జాతీయ రహదారి 65పైకి చేరుకోవాలి. అవసరమైతే వ్యక్తిగత వాహనాలు సైతం ఇదే మార్గంలో వస్తే ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉండవని పోలీసులు సూచిస్తున్నారు.


పెద్దగట్టు జాతర సందర్భంగా వాహనాల మళ్లింపు..
ట్రాఫిక్ డైవర్షన్ 1 :- హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెల్లు వాహనాలను టేకుమట్ల మద్ద జాతీయరహదారి 65 నుండి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారి 365 బిబి మీదుగా మళ్లించి, రాఘవపురం స్టేజి నుండి నామవరం గ్రామం మీదుగా జాతీయరహదారి 65 పై గుంజలూరు స్టేజి వరకు మళ్లించి కోదాడ, విజయవాడ వైపుకు పంపించడం జరుగుతుంది. 
 హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్ళు బారి వాహనాలు, ట్రాన్స్పోర్ట్ వాహనాలను టేకుమట్ల నుండి జాతీయ రహదారి 365 మీదుగా నాయకెన్ గూడెం నుండి కోదాడ వైపు మళ్లింపు చేయడం జరిగినది.


ట్రాఫిక్ డైవర్షన్ 2 :-  విజయవాడ నుండి సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వెళ్ళే వాహనాలను జాతీయ రహదారి 65 పై  స్వామి నారాయణ్ గురుకుల్ స్కూల్ ఎదురుగా ఉన్న SRSP కెనాల్ రోడ్డు మీదుగా ఖమ్మం జాతీయ రహదారి 365బిబి రోల్లబండ తండా వరకు మళ్లించి జాతీయరహదారి రాయినిగూడెం వద్ద యూ టర్న్ చేసి హైదరాబాద్ వైపు పంపించడం జరుగుతుంది.


విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళే బారి వాహనాలు, ట్రాన్స్పోర్ట్ వాహనాలను కోదాడ, నరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా నార్కట్ పల్లి వద్దకు మళ్ళించడం జరిగినది.


కోదాడ, మునగాల, గుంపుల మీదుగా సూర్యాపేట పట్టణానికి వచ్చే RTC బస్సులు, ఇతర చిన్న ప్రజా రవాణా వాహనాలు SRSP కెనాల్ నుండి బీబిగుడెం వద్ద నుండి సూర్యాపేట పట్టణానికి పంపడం జరుగుతుంది. సూర్యాపేట పట్టణం నుండి వెళ్ళే RTC బస్సులు, ప్రజా రవాణా వాహనాలు కుడ కుడ గ్రామం మీదుగా ఐలాపురం వద్ద ఖమ్మం జాతీయరహదారి మీదుగా రాఘవపురం స్టేజి నుండి నామవరం గ్రామం మీదుగా జాతీయరహదారి 65 పై గుంజలూరు స్టేజి వరకు మళ్లించి కోదాడ, విజయవాడ వైపుకు పంపించడం జరుగుతుంది. 


జాతరకు వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ నిమిత్తం 4 అంతకన్నా ఎకువ చక్రాలు గల వాహనాలకు 4 బారి పార్కింగ్ ప్రదేశాలను, ద్విచక్ర వాహనాలకు కోసం ప్రత్యెక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.


మొదటి పార్కింగ్ ఏరియా :
సూర్యాపేట మీదుగా జాతర కు వచ్చే భక్తుల వాహనాలను NH 65 మీద గల HP పెట్రోల్ బంక్ నుండి రామకోటి తండాకు వెల్లు మార్గంలో వాహనాల పార్కింగ్ కు ద్విచక్ర వాహనాలను, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల కోసం పార్కింగ్ స్థలం ఏర్పాటు.


రెండవ పార్కింగ్ ఏరియా :
గరిడేపల్లి, పెనపహడ్ వైపుగా జాతర కు వచ్చే భక్తుల వాహనాలను కలక్టర్ కార్యాలయం వెనుక గల స్థలంలో బారి పార్కింగ్ స్థలం ఏర్పాటు.


మూడవ పార్కింగ్ ఏరియా :
కోదాడ, మునగాల, గుంపుల వైపుగా జాతర కు వచ్చే భక్తుల వాహనాలను ఖాసింపేట గ్రామం వెల్లు మార్గంలో పార్కింగ్ స్థలం ఏర్పాటు.
నాలుగోవ పార్కింగ్ ఏరియా :
మోతే, చివ్వేంల మీదుగా జాతరకు వచ్చే భక్తుల వాహనాలను చివ్వేంల మీదుగా మళ్లించి మున్యానాయక్ తండా వద్ద(గట్టుకు వెనకాల) పార్కింగ్ స్థలం కేటాయించడం  జరిగినది.


VIP పార్కింగ్ ఏరియా : 
జాతరకు వచ్చే VIP ల యొక్క వాహనాల కోసం పెద్దగట్టు యొక్క తూర్పు మెట్లకు ఎదురు భాగంలో గల స్థలంలో పార్కింగ్ స్థలం కేటాయించడం జరిగినది.