తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుందని రెండు రాష్ట్రాల వాతావరణ శాఖలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణలో చలి తీవ్రత కాస్త ఎక్కువగా ఉండబోతుంది. ఏడు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్ జారీ చేశారు. 


తెలంగాణ రాష్ట్రంలో చలి మళ్లీ పెరిగింది. హైదరాబాద్ వాతావరణ శాఖ 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏడు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసిన జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఐదు నుంచి పది డిగ్రీల మధ్య ఉంటాయి. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పదకొండు నుంచి పదిహేను డిగ్రీల వరకు నమోదుకు అవకాశం ఉంది. ఐదు రోజుల ఉష్ణోగ్రత అంచనాలు విడుదల చేసిన తెలంగాణ వాతావరణ శాఖ... ఇందులో రెండు రోజులు ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది. నిన్నటి కంటే ఇవాళ చలి తీవ్రత ఎక్కువ ఉంటుందని చెబుతోంది. 






ఆదిలాబాద్, కుమ్రుంభీమ్‌, నిర్మల్‌, మంచిర్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాల్‌పల్లి, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్ జారీ అయింది. రేపటికి పరిస్థితి చక్కబడే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రంగా భారీగా తగ్గిపోనుంది. రేపు పద్నాలు జిల్లాల్లో మాత్రం చలి తీవ్ర ఉండనుంది. అది కూడా పదకొండు డిగ్రీల నుంచి పదిహేను డిగ్రీల మధ్య ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది.


తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతానికి ఎలాంటి వర్ష సూచనలు లేవని హైదరాబాద్‌ వాతావరణం కేంద్రం తెలిపింది. నిన్న విడుదల చేసిన బులెటిన్ బట్టి చూస్తే... ఖమ్మంలో గరిష్ణ ఉష్ణోగ్రత నమోదు అయింది. 33.6 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అత్యల్ప ఉష్ణోగ్రత 7.7 డిగ్రీలు ఆదిలాబాద్‌లో నమోదైంది.  ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత 30 డిగ్రీలుగా ఉంటుందని... అత్యల్పం 15 డిగ్రీలుగా ఉంటుందని అంచనా వేసింది. 
 
ఇవాళ్టి నుంచి ఏడో తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంది. ఈ రెండు రోజులు మాత్రం చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. అందుకే ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు అలా ప్రిపేర్ అవ్వాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. 


ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ శాఖ మాత్రం ఎలాంటి వెదర్ బులెటిన్ విడుదల చేయలేదు. రెండు రోజుల క్రితం విడుదల చేసిన బులెటిన్‌లో చెప్పిన వివరాల ప్రకారం... ఈ మధ్య శ్రీలంకలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం రాష్ట్రంలోని కోస్తా ప్రాంతంపై పెద్దగా ఉండబోదని తెలిపింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొంది. ఎలాంటి వర్ష సూచన కూడా లేదని తేల్చేసింది. 
 






ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో మొన్నటి వరకు అత్యంత కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇప్పుడిప్పుడు ఆ పరిస్థితి నుంచి ఆ ప్రాంతాలు తేరుకుంటున్నాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. చలి గణనీయంగా తగ్గింది. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో హిమపాతాలు, లోతట్టు మైదానాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికీ చాలా చోట్ల ఉదయం, సాయంత్రం పొగమంచు కనిపిస్తోంది.