Bhadradri Kothagudem People Requests KCR For Justice: ‘కేసీఆర్‌గారు ఎమ్మెల్యే తండ్రి, భర్త నుంచి మా భూములను ఇప్పించండి.. 12 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం..’ అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ గ్రామానికి చెందిన బాధితులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. విద్యానగర్‌లో భూ మాఫియా చేస్తున్న వ్యక్తులపై విసుగు చెందిన వీరు రోడ్డెక్కడం ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణానికి శివారు ప్రాంతంగా విద్యానగర్ కాలనీ ఉంది. కొత్తగూడెం జిల్లా కేంద్రం కావడంతో పట్టణానికి దగ్గరగా ఉన్న ఈ భూమి విలువ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఇక్కడ భూ కబ్జాలు, సెటిల్‌మెంట్లు జోరందుకున్నాయి. గతంలో అనేక ఏళ్ల నుంచి ఇక్కడ వివాదస్పదుడిగా మారిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ తండ్రి బాదావత్ సీతారాములు కూతురు పదవిని అడ్డుపెట్టుకుని విద్యానగర్ కాలనీలో కబ్జాలకు, సెటిల్‌మెంట్‌లకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో విద్యానగర్ కాలనీలోని 137/1, 137/9 భూమిలో ఎమ్మెల్యే తండ్రి తమను వేదిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించి, ఏకంగా టెంట్ వేసి నిరసన తెలిపారు. కాగా ఈ ర్యాలీకి గ్రామ సర్పంచ్ బానోత్ గోవింద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ సంఘీబావం తెలపడం గమనార్హం. ఖాళీ స్థలం కనపడితే నోటీసులు.. కోట్లలో సెటిల్‌మెంట్‌లు..విద్యానగర్ కాలనీ ఏజెన్సీ పరిధిలో ఉంది. అయినప్పటికీ జిల్లా కేంద్రానికి శివారు ప్రాంతం కావడం, ఖమ్మం – కొత్తగూడెం ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో ఇక్కడ భూముల విలువ భారీగానే పెరిగింది. ఈ నేపథ్యంలో ఇల్లందు ఎమ్మెల్యే తండ్రి బాదావత్ సీతారాములు ఇక్కడ ఖాళీ స్థలాలకు నోటీసులు పంపి సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలున్నాయి. ఈ విషయంపై గతంలో అనేక సార్లు బాదితులు పోలీస్ స్టేషన్ వరకు పంచాయతీలు వెళ్లాయి. ఖాళీ స్థలాలకు నోటీసులు పంపి సెటిల్‌మెంట్ పేరుతో కోట్లాధి రూపాయలు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
Bhadradri Kothagudem: కేసీఆర్ సార్ - ఎమ్మెల్యే తండ్రి, భర్త నుంచి మా భూములు కాపాడండి - బాధితుల వినూత్న నిరసన
ABP Desam | 18 Jun 2022 08:14 AM (IST)
‘కేసీఆర్‌గారు ఎమ్మెల్యే తండ్రి, భర్త నుంచి మా భూములను ఇప్పించండి.. 12 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం..’ అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యానగర్ కాలనీ వాసులు నిరసన చేపట్టారు.
తమ స్థలాన్ని ఇప్పించాలని బాధితుల నిరసన
Published at: 18 Jun 2022 09:04 AM (IST)