వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై తేనెటీగలు దాడి చేశాయి. ప్రజాప్రస్థానం పేరుతో చేస్తున్న షర్మిల చేస్తున్న పాదయాత్రలో ఈ అపశృతి జరిగింది. నల్గొండ జిల్లా కొండపాక గూడెం నుంచి పాదయాత్రను మొదలుపెట్టిన వైఎస్‌ షర్మిల.. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో యాత్రను కొనసాగస్తున్నారు. 


వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర మోటకొండూరు మండలం నుంచి ఆత్మకూరు మండలానికి వెళ్తున్న క్రమంలో తేనెటీగలు దాడి చేశాయి. దుర్శగానిపల్లి గ్రామం వద్ద చెట్టు కింద గ్రామస్తులతో మాట్లాడారు షర్మిల.  ఆ టైంలోనే ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. 


సహాయక సిబ్బంది అప్రమత్తమై ఆమెను అక్కడి నుంచి తప్పించారు. దీంతో  తేనెటీగల దాడి నుంచి వైఎస్‌ షర్మిల బయటపడ్డారు. వైఎస్‌ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 400 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. 






పాదయాత్ర నాలుగు వందల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా  ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలం చండేపల్లి గ్రామంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు షర్మిల. ప్రజా సమస్యలపై వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పోరాడుతూనే ఉంటుందన్నారు.






 


ఇక బీజేపీ , టీఆర్ఎస్ మధ్య ఎస్టీ రిజర్వేషన్ల మంటలు - కేంద్రమంత్రి సమాధానంతో ప్రారంభమైన రచ్చ !


తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై మరోసారి కేంద్రం క్లారిటీ, లోక్‌సభలో మంత్రి కుండబద్దలు


పిల్లలూ మీరు రెడీయా! పేరెంట్స్‌ ఈ ఛాన్స్‌ మిస్‌ చేయకండి!


బోధన్ అల్లర్ల కేసులో న్యూ ట్విస్ట్, అసలు సూత్రధారుల్లో టీఆర్‌ఎస్‌ లీడర్


రాజమౌళిని డిజప్పాయింట్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్