Minister Ponguleti : తెలంగాణ ఏకనాథ్ షిండేగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవుతారని కొంత మంది సోషల్ మీడియా ఇంటర్యూల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ అంశంపై మీడియా ప్రతినిధులతో మాట్లాడినప్పుడు స్పందించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పార్లమెంట్ ఎన్నికల తరువాత నేనే సీఎం అనడం ఊహాజనితమని మండిపడ్డారు. పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయని.. తన దగ్గర పండ్లు ఉన్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట రోజు ఉంటే నంబర్ 2 ఎలా అవుతానని ప్రశ్నించారు. హైకమాండ్ కూడా నేను సీఎం కావాలంటే కొన్ని ఈక్వేషన్స్ చూస్తుంది కదా..! అని ప్రశ్నించారు.
నేను సీఎం కావాలని అనుకోవట్లేదు..ఆలోచన లేదుని.. తాను ఎవ్వరికీ టచ్ లోకి వెళ్ళలేదు..అదంతా ప్రచారం అన్నారు. మా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు గెలవబోతున్నామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మీద మేము కక్ష పూరితంగా కేసూలు పెడుతున్నామంటున్నారు. అవన్ని గత ప్రభుత్వంలో వారు అధికార దుర్వినియోగంతో చేసిన తప్పులు అన్ని కనబడుతున్నవి కదా అని ప్రశ్నించారు. జలాశయాల్లో నీరు లేకపోవడం, పంటలు ఎండిపోవడం వంటీ ఫోటోలు. వీడియోలు పెట్టి కొన్ని మీడియా సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వం పై నిందలు వెసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.
మా ప్రభుత్వం ఏర్పడింది డిసెంబర్ లో రాబోయే ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని నీటి నిల్వలు ఉంచాల్సిన బాధ్యత వారిపై ఉంది కాని చేయాల్సిన పనులు చేయకుండా భాద్యత విస్మరించి మాపై రాళ్ళేయడం తగదని మండిపడ్డారు. కాళేశ్వరం ఫలితం ఎవరికి దక్కిందో అందరికి తెలిసిందేనని పొంగులేి గుర్తు చేసారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒకటి రెండు ఎంపీ సీట్లు గెలిస్తే గొప్ప అనుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ. మాకు ఎంఐఎం మద్దతు తెలపుతుంది. ఇతర పార్టీల నుండి మా పార్టీలోకి రమ్మని మేం ఎవరిని అడగటం లేదు. వారికై వారు స్వచ్చందంగా వస్తున్నారని గుర్తు చేశారు.
మేం ఇంకా గేట్లు ఎత్తలేదని ఎత్తితే వరద ఆగదని చేరికలపై వ్యాఖ్యానించారు. మేం చెప్పిందే చేస్తున్నం. గత పాలకుల అవినీతి మీద పోరాడుతూనే. డిస్టర్బ్ అయిన వ్యవస్థను దారిలో పెడుతున్నామన్నారు. 5ఎకరాలకు రైతు బంధు అని చెప్పినట్టే ఇస్తున్నామన్నారు. జీతాల చెళ్ళింపుల్లో కొంత ఆలస్యం అయిన మాట వాస్తవమే. ఆ దిశగా పరిష్కారం కోసం పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడేందుకు వెనుకాడబోమమని.. 14స్థానాలు గ్యారెంటీ గెలుస్తామన్నారు. రెండు సంవత్సరాలు కంటే ఎక్కువగా ఉన్న అధికారులను మొత్తం షిఫ్ట్ చేస్తాం... రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేస్తామని.. ధరణి లో మంచి అంశాలు ఉంటే ఉంచి.. భూమాత పోర్టల్ ను తీసుకొస్తామని ప్రకటించారు.