ABP  WhatsApp

KTR Tweet: గాంధీని అవమానించడంపై కేటీఆర్ ఫైర్- ఎన్ని జన్మలెత్తినా సాధించలేరని ట్వీట్!

ABP Desam Updated at: 03 Oct 2022 04:43 PM (IST)
Edited By: Murali Krishna

KTR Tweet: మహాత్మా గాంధీని అవమానించడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గాంధీకి అవమానంపై కేటీఆర్ ఫైర్

NEXT PREV

KTR Tweet: కోల్‌కతాలోని హిందూ మహా సభ పండల్‌లో మహాత్మా గాంధీని మహిషాసురుడిగా చిత్రీకరించడం వివాదానికి దారి తీసింది. అసుర అనే రాక్షసుడిని మహాత్మా గాంధీగా చిత్రీకరించడంపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది. ఈ వివాదంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు.


కొంతమంది విష గురువులు, గాడ్సే అభిమానులు.. గాంధీ ఖ్యాతిని తగ్గిద్దామని ప్రయత్నాలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. అయినా వారికి అది సాధ్యం కాదన్నారు.







విశ్వగురువుగా ప్రపంచం గుర్తించిన ఏకైక భారతీయుడు మహాత్మా గాంధీజీ. కొంతమంది విష గురువులు, వారి గాడ్సే ల్లాంటి అభిమానులు మహాత్ముడిని కించపరచాలని, ఆయన ఖ్యాతిని, భావజాలాన్ని తగ్గించాలని ఎంత కష్టపడినా వ్యర్థం. ఎందుకంటే ఎన్ని జన్మలెత్తినా వారు అది సాధించలేరు.                     - కేటీఆర్, తెలంగాణ మంత్రి


ఇదీ జరిగింది


జాతిపిత మహాత్మా గాంధీని హిందూ మహాసభ అవమానించింది. బంగాల్ రాజధాని కోల్‌కతాలో దుర్గా మాత మండపంలో గాంధీని మహిషాసురుడిగా చిత్రీకరించారు. కోల్‌కతాలోని హిందూ మహా సభ పండల్‌లో మహాత్మా గాంధీని మహిషాసురుడిగా చిత్రీకరించడం వివాదానికి దారి తీసింది. అసుర అనే రాక్షసుడిని మహాత్మా గాంధీగా చిత్రీకరించిన అఖిల భారత హిందూ మహాసభ నిర్వాహకులు ఇబ్బందుల్లో పడ్డారు. దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అఖిల భారతీయ హిందూ మహాసభ ఈ మండపాన్ని ఏర్పాటు చేసింది. దుర్గా మాత వధించిన అసురుడి ముఖం.. గుండ్రటి కళ్లద్దాలతో బాపూను తలపించింది.


నిర్లక్ష్యంగా


ఈ వివాదంపై మీడియా ప్రశ్నించగా ఆల్ ఇండియా హిందూ మహాసభ బంగాల్ రాష్ట్ర విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రచూర్ గోస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.



గాంధీని అన్ని చోట్ల నుంచి తొలగించి, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇతర స్వాతంత్ర్య సమరయోధులను ముందు ఉంచాలనుకుంటున్నాం. గాంధీ.. జాతిపిత అని మేము విశ్వసించడం లేదు. దుర్గమ్మ విగ్రహంలో అసురుడి రూపం గాంధీని తలపించడం యాదృచ్ఛికం మాత్రమే.  "
- చంద్రచూర్ గోస్వామి, ఆల్ ఇండియా హిందూ మహాసభ బంగాల్ రాష్ట్ర విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్



మార్పు


బంగాల్  హిందూ మహాసభ చేసిన పనిని పలు పార్టీల నేతలు ఖండించారు. దీంతో నిర్వాహకులు విగ్రహాన్ని మార్చారు. హోం మంత్రిత్వ శాఖ ఒత్తిడి మేరకు పూజ నిర్వాహకులు గాంధీ చిత్రాన్ని మార్చారు.


Also Read: Helium Tank Blast Tamil Nadu: రద్దీ మార్కెట్‌లో పేలిన హీలియం ట్యాంక్- వైరల్ వీడియో!


Also Read: Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

Published at: 03 Oct 2022 04:40 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.