Helium Tank Blast Tamil Nadu: తమిళనాడులోని తిరుచ్చిలో ఆదివారం ప్రమాదం జరిగింది. కొటై వసల్ ప్రాంతంలోని రద్దీ మార్కెట్‌లో హీలియం ట్యాంక్ పేలిపోవడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. పలువురు గాయపడ్డారు.


ఇదీ జరిగింది


కొటై వసల్ ప్రాంతంలో రద్దీ మార్కెట్‌లో ఓ వ్యక్తి హీలియం బుడగలు అమ్ముకుంటున్నాడు. అయితే బుడగలకు గాలి కొడుతోన్న సమయంలో ఒక్కసారిగా హీలియం ట్యాంక్ పేలిపోయింది. దీంతో జనాలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. పలువురికి గాయలయ్యాయి.


ఆ ప్రాంతంలో ఉన్న పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దుకాణాల అద్దాలు పగలిపోయాయి. ఆ సమయంలో దుకాణాల్లోని జనం కూడా బెంబేలెత్తారు. మంటలతో పాటు పొగలు చుట్టుపక్కల కమ్ముకున్నాయి. ఈ ఘటన మొత్తం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో రికార్డు అయింది.






వైరల్


హీలియం ట్యాంక్ పేలుడులో మృతి చెందిన వ్యక్తిని మాట్టు రవిగా గుర్తించారు. సీసీటీవీ దృశ్యాలు ఆధారంగా ఘటన ఎలా జరిగిందనేది పోలీసులు విశ్లేషిస్తున్నారు. బెలూన్ అమ్మిన వ్యక్తి  కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also Read: Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!


Also Read: Mulayam Singh Yadav Health: ములాయం సింగ్ పరిస్థితి విషమం- క్రిటికల్ కేర్ యూనిట్‌కు తరలింపు!