Himanshu Tweet : తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మనవడు హిమాన్షు అంటే చాలా ఇష్టమని రాజకీయవర్గాలు చెబుతూ ఉంటాయి. హిమాన్షు కేటీఆర్ కుమారుడు.  మనవడిపై తాత కేసీఆర్‌కు ఎంత ప్రేమ ఉందో..  హిమాన్షుకు కూడా కేసీఆర్ పై అంత కంటే ఎక్కువ ప్రేమ ఉంది. ఆ విషయం తొలి సారి సోషల్ మీడియా వేదికగా చూపించారు. తన తాత అంటే కేసీఆర్ టైగర్ అని.. సోషల్ మీడియాలో తేల్చేశారు. హిమాన్షు అలా చూపించిన తర్వాత ఇక నెటిజన్లు ఊరుకుంటారా?.   


ఆనంద్ మహింద్రా ట్వీట్‌కు రిప్లయ్ ఇచ్చిన హిమాన్షు


సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ఆనంద్ మ‌హీంద్రా గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా  ఓ పోస్ట్ చేశారు. సైలెంట్గా అన్నీ ప‌రిశీలిస్తున్న ఓ పులి ముఖం ఫొటోను పోస్ట్ చేసిన మ‌హీంద్రా... నేనేమీ రియాక్ట్ కాను. అయితే అన్నింటినీ సైలెంట్గా గమనిస్తానని న‌మ్ము అనే విషయాన్ని టైగర్ చెబుతున్న‌ట్లుగా ట్వీట్ చేశారు. మీ ఇంట్లో ఈ త‌ర‌హా కేట‌గిరీ వ్య‌క్తి ఎవ‌రంటూ మ‌హీంద్రా ప్ర‌శ్న‌ వేశారు. 





ఈ ట్వీట్‌కు చాలా మంది స్పందించారు.  అనూహ్యంగా  హిమాన్షు కూా స్సపందించారు.   'మై గ్రాండ్ ఫాదర్ ' అంటూ రిప్లై ఇచ్చాడు.



నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు


దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అయితే ఈ ట్వీట్ చేసింది ఇప్పుడు కాదు. ఆగస్టు 11న చేసిన ఈ ట్వీట్ తాజాగా వైరల్ అయింది. హిమాన్షు ట్విట్టర్ ఖాతా వెరీఫైడ్ ఖాతా కాకపోవడంతో అది వరిజినలా కాదా అనే డౌట్ నెటిజన్లకు ఉంది. అయితే పలు ఫోటోలను షేర్ చేస్తూండటంతో హిమాన్షు ఖాతానేనని భావిస్తున్నారు. హిమాన్షు ట్వీట్‌ను టీఆర్ఎస్ నేతలు రీ ట్వీట్ చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలైతే హిమాన్షుకు సపోర్ట్ చేస్తూ .. ఎప్పటికీ మా లీడర్ కేసీఆర్ పులేనంటూ రిప్లై ఇస్తున్నారు.  


ట్విట్టర్‌ ఆనంద్ మహింద్రాతో పలుమార్లు కేటీఆర్ సంభాషణ


గ‌తంలో మ‌హీంద్రా ట్వీట్ల‌కు కేటీఆర్ స్పందించ‌గా...తాజాగా మ‌హీంద్రా ట్వీట్‌కు కేటీఆర్ కుమారుడు స్పందించారు.  మొత్తానికి ఆనంద్ మ‌హీంద్రా విసిరిన ట్వీట్ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. ఆనంద్ మహింద్రాతో కేటీఆర్, కేసీఆర్‌లకు సుహృద్భావ సంబంధాలున్నాయి. ఓ సారి టెక్ మహింద్రా సీఈవో గుర్నానీకి కేటీఆర్ గొడుగు పట్టిన అంశాన్ని..అలాగే ఎలక్ట్రిక్ కార్ల ఫార్ములా వన్ రేసింగ్‌సకు హైదరాబాద్ ఆతిధ్యమవ్వడాన్ని ఆనంద్ మహింద్రా ప్రశంసించారు. కేటీఆర్‌ను అభినందించారు.  అయితే హిమాన్షు ..తాత కేసీఆర్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్ మాత్రం సోషల్ మీడియాలో హైలెట్‌గా మారింది.