Kishan Reddy On KCR : ఇతర రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న నేతలకు తెలంగాణ సీఎం కేసీఆర్ డబ్బులిచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. శనివారం  సికింద్రాబాద్ వారసిగుడ సభలో ప్రజా గోస – బీజేపీ భరోసా శక్తి కేంద్రాల్లో బీజేపీ నిర్వహించిన సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు.  అక్కడ బస్తీ వాసులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.  రాష్ట్రాల్లో ఎవరైన నాయకులు ఖాళీగా ఉంటే వారికి డబ్బులు ఇచ్చి బీఆర్‌ఎస్‌ లో చేర్చుకుంటున్నారని ... అబద్ధాలు ఆడటంలో నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని మండిపడ్డారు.  కేసీఆర్‌ కుటుంబం తెలంగాణకు శాపమన్నారు.  మోదీ మీద విష ప్రచారం చేస్తున్నారని  అన్నారు. 


కేసీఆర్ కుటుంబాన్ని బంగారం చేసుకున్నారన్న కిషన్ రెడ్డి 


పక్క రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లుకడుతున్నారని తెలంగాణలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు.  దోపిడి చేసుకొని ఫామ్ హౌజ్ లు కడుతున్నారని నిప్పులు చెరిగారు. వేలాది కోట్ల రూపాయలు వెనకేసుకున్నడు కేసీఆర్‌ అంటూ ఆరోపించారు. ఏ మాఫియా లో చూసిన కేసీఆర్‌ కుటుంబం ఉందని, రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం పోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు . బంగారు తెలంగాణగా మారుస్తానని.. సీఎం కేసీఆర్ వాళ్ళ కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడని విమర్శించారు.   కేసీఆర్‌ కుటుంబాన్ని రెండు సార్లు గెలింపించామని.. బంగారు తెలంగాణ గా మారుస్తా అని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడని విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ అధికారంలో ఉన్నన్ని రోజులు తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్, విమానాలు కొంటారని, తెలంగాణ ప్రజల డబ్బు దోచుకుంటున్నారని మండిపడ్డారు. 


11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు 


15 రోజుల్లో 11వేల వీధి సభలకు తెలంగాణ బీజేపీ  సిద్ధణయింది.  శక్రవారం  నుంచి 15 రోజుల పాటు శక్తి కేంద్రాల పరిధిలో కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నారు.  రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర పథకాలపై నేతలు ప్రసంగించనున్నారు. రెండోదశలో మండలం యూనిట్‌గా ప్రజాగోస-బీజేపీ భరోసా పేరిట బైక్‌ర్యాలీలు 15 రోజుల పాటు నిర్వహిస్తారు. ఇక, మూడోదశలో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగసభలు ఏర్పాటుచేస్తారు. 15 రోజుల్లో వీటిని పూర్తిచేసి, ఆ తర్వాత జిల్లా స్థాయిలో సభలు నిర్వహిస్తారు. మూడు, నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలను కలిపి ఒక క్లస్టర్‌గా బీజేపీ గుర్తించింది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలను నాలుగు క్లస్టర్లుగా విభజించింది. జిల్లా స్థాయిలో బహిరంగసభలు పూర్తయిన తర్వాత క్లస్టర్‌ స్థాయిలో భారీ సభలు ఏర్పాటుచేయనుంది.


ముందస్తు ఎన్నికల కోసం సన్నాహాలు


మందస్తు ఎన్నికల కోసమే పెద్ద ఎత్తున బీజేపీ ఇలాంటి ప్రచార కార్యక్రమాలను ఖరారు చేసుకుని రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది.  మార్చిలో అసెంబ్లీని రద్దు చేయవచ్చునని అంచనా వేస్తున్నారు. అందుకే కేసీఆర్‌పై బీజేపీ నేతలు మాటల దాడి పెంచుతున్నారు.                            


బులెట్‌ ప్రూఫ్‌ వాహనం కోసం రాజాసింగ్ వినూత్న నిరసన- టూవీలర్‌పై అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే