ఏపీలో 5 కొత్త మెడికల్ కాలేజీలు, ఈ ఏడాది తరగతులు ప్రారంభం కావాల్సిందే! అధికారులకు మంత్రి ఆదేశం!

వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని, మార్చిలోగా పనులు పూర్తిచేయాలని అధికారులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు.

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే 5 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆయా కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. రాజమహేంద్రవరం, నంద్యాల, ఏలూరు, విజయనగరం, మచిలీపట్నంలోని వైద్య కళాశాలల నిర్మాణంలో జాతీయ వైద్య మండలి (NMC) తనిఖీ బృందం గుర్తించిన లోపాలు, తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుతో కలిసి ఫిబ్రవరి 10న ఆమె సమీక్షించారు.

Continues below advertisement

తరగతుల ప్రారంభానికి తగ్గట్టు నిర్మాణాలను మార్చిలోగా పూర్తిచేసే బాధ్యత రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అధికారులదేనని అన్నారు. కళాశాలల్లో 30 శాతంలోపు సిబ్బంది నియామకాలను సత్వరం చేపట్టాలన్నారు. ఫర్నిచర్, పరికరాల కొనుగోలు చర్యలు ముమ్మరం చేయాలని, వీటికి నిధుల కొరత లేదని తెలిపారు. ఈ 5 కొత్త మెడికల్ కళాశాలల్లో 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

పనుల్లో జాప్యంపై ప్రశ్నించిన ఎన్‌ఎంసీ..
ఏపీలోని 5 వైద్య కళాశాలల పనుల్లో ఆశించినమేర పురోగతి లేకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) తనిఖీ బృందాలు ప్రశ్నించాయి. సీనియర్ రెసిడెంట్ల కొరతతోపాటు నిర్మాణాల్లో పురోగతి లేకపోవడంపై తనిఖీ బృందాలు రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరాయి. 

➥పరికరాలు, ఫర్నిచర్ లేకపోవడంపై ప్రశ్నించాయి. ముఖ్యంగా ఐదు జిల్లా ఆసుపత్రులను వైద్య కళాశాలలుగా మార్చాలన్న నిర్ణయం తీసుకునేందుకే వి జయనగరం, రాజమహేంద్రవరం వైద్య కళాశాలల భవనాలు, వసతిగృహాలు నిర్మాణ దశలోనే ఉన్నాయి. మచిలీపట్నం కళాశాల వసతిగృహం, లైబ్రరీ, స్టాఫ్‌రూమ్‌లు, క్వార్టర్స్ నిర్మాణ దశలోనే ఉన్నాయి. 

➥ నంద్యాల కళాశాలలో ప్రీ-పారా క్లినికల్ డిపార్టుమెంట్లు లేవు. మిగిలినవాటితో పోలిస్తే ఏలూరు కళాశాల నిర్మాణం బాగా వెనకబడి ఉంది. మరోవైపు ఈ కళాశాలల్లో 208 పరికరాలను సమకూర్చుకోవాల్సి ఉంది. వీటి కొనుగోలుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఎన్‌ఎంసీ బృందాలు గుర్తించిన లోపాలను సరిచేస్తూ నిర్మాణాలను మార్చినాటికి పూర్తి చేయాలని గుత్తేదారులను వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది.

Also Read:

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌, త్వరలో 10 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ!
తెలంగాణలో మరో ఉద్యోగాల జాతరకు త్వరలోనే సైరన్ మోగనుంది. రాష్ట్రంలో త్వరలోనే 10 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఈ మేరకు అసెంబ్లీలో ఫిబ్రవరి 10న అసెంబ్లీలో ప్రకటించారు. మన ఊరు-మన బడి మొదటిదశ కింద మరమ్మతులు చేపట్టిన 9,123 పాఠశాలలు జూన్ నాటికి సిద్ధమవుతాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థులు లేరని ఎక్కడా పాఠశాలలు మూసివేయడం లేదన్నారు. భాషా పండితులు, ఇతర సమస్యలు కొన్ని కోర్టుల్లో ఉండటంతో పరిష్కారం కాకుండా నిలిచిపోయాయని పేర్కొన్నారు. 317 జీవో కింద ఇతర జిల్లాలకు వెళ్లిన వారికి ప్రస్తుత బదిలీల్లో పాత జిల్లాల్లో పోస్టింగ్‌లకు అవకాశాలు ఉన్నాయన్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

Certificates in DigiLocker: ఫేక్ సర్టిఫికేట్లకు కేంద్రం చెక్, యూనివర్సిటీలకు కీలక ఆదేశాలు జారీచేసిన యూజీసీ!
దేశంలో ఇకపై నకిలీ సర్టిఫికేట్ల దందాకు చెక్ పడనుంది. ఇంజినీరింగ్, డిగ్రీ చదవకుండానే నకిలీ సర్టిఫికేట్లను కొంటున్న వారికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇకపై విద్యార్థుల సర్టిఫికేట్లను 'డిజీ లాకర్‌'లో నిక్షిప్తం చేయాలంటూ యూజీసీ ద్వారా అన్ని వర్సిటీలను ఆదేశించింది. డిజీ లాకర్ల ఏర్పాటు, పర్యవేక్షణ బాధ్యతను కేంద్ర మానవ వనరుల శాఖకు అప్పగించింది. విదేశాల్లో ఉన్నత విద్య ప్రవేశాలు మొదలవడం, దేశం నుంచి విద్యార్థులు అమెరికా, ఐరోపా, అస్ట్రేలియాలకు వెళ్తుండటంతో కేంద్ర మానవవనరుల శాఖ అప్రమత్తమైంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement